బిజెపి సభ్యత్వ నమోదు

0
1నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని మాచారెడ్డి మండలంలోని గ్రామాలలో భారతీయ జనతా పార్టీ నాయకులు కాటిపల్లి రమణారెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సుపరిపాలన, ప్రభుత్వ పథకాలు చిట్ట చివరి ప్రజలకు చేరువయ్యేలా నరేంద్రమోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు. తెలంగాణాలో బీజేపీకి రోజురోజుకీ ఆదరణ పెరుగుతుందని, నియంతత్వ పాలనకు వ్యతిరేకంగా ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని అన్నారు. ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ బీజేపీ ప్రజల పక్షాన నిలబడుతుందని అందుకే సభ్యత్వ నమోదులో దూసుకుపోతోందని అన్నారు. ఆయన వెంట పలువురు నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here