బిజెవైఎం నాయకులు మతిభ్రమించి మాట్లాడుతున్నారు

0
4



నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బిజెవైఎం నాయకులు మతిభ్రమించి మాట్లాడుతున్నారని, మేము ప్లాస్టిక్‌ రహిత పర్యావరణ పరిరక్షణను స్వాగతిస్తున్నామని బైండ్ల ప్రశాంత్‌ అన్నారు. శనివారం ఎన్‌ఎస్‌యుఐ ఆధ్వర్యంలో ఆర్మూర్‌ ఆర్‌అండ్‌బి గెస్ట్‌ హౌస్‌లో విలేకరులతో మాట్లాడారు. బిజెపి నాయకుడి పుట్టినరోజు సందర్భంగా మీరు బుక్స్‌, టేబుల్స్‌ విద్యార్థులకు ఇవ్వండి కానీ పాఠశాల అంటే దేవాలయంతో సమానమని అన్నారు. ఆలాంటిది మీరు రాజకీయంగా వాడుకుంటున్నారని, దద్దమ్మలు మేము కాదని మీరని, మీ పార్టీ గుర్తుతో పాఠశాలలో జూట్‌ బ్యాగులు ఇవ్వడం సరికాదన్నారు. మీరు మా గురించి మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి అని హెచ్చరించారు. కార్యక్రమంలో ఆర్ముర్‌ ఎన్‌ఎస్‌యుఐ నియోజకవర్గ అధ్యక్షులు బైండ్ల ప్రశాంత్‌, నియోజకవర్గ నాయకులు భగత్‌, నాయకులు అన్వేష్‌, సల్మాన్‌, బాబ్ల్‌, వినీత్‌, ముస్తప, శశి తరిదరులు పాల్గొన్నారు.



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here