బీఅలర్డ్: మీకు డబుల్ సిలిండర్ ఉందా, అయితే మీ కోసమే ఇది!

0
4


బీఅలర్డ్: మీకు డబుల్ సిలిండర్ ఉందా, అయితే మీ కోసమే ఇది!

ముంబై: మీ వద్ద రెండు సిలిండర్లు ఉన్నాయా? అయితే ఈ వార్త మీకోసమే! ఇటీవల సౌదీ అరేబియాలోని ఆరామ్‌కో రెండు చమురు క్షేత్రాలపై డ్రోన్ దాడి జరిగిన విషయం తెలిసిందే. దీంతో చమురు ధరలు పెరుగుతున్నాయి. గత పది పదిహేను రోజులుగా పెట్రోల్ ధరలు స్వల్పంగా పెరుగుతున్నాయి. ఈ ప్రభావం గ్యాస్ పైన కూడా పడే అవకాశాలు ఉన్నాయి. వంట గ్యాస్ లేదా ఎల్పీజీ తాత్కాలిక కొరత నేపథ్యంలో ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్, భారత్ పెట్రోలియం కార్పోరేషన్, హిందూస్తాన్ పెట్రోలియం కార్పోరేషన్ వంటి ఆయిల్ కంపెనీలు వినియోగదారుల ఎల్పీజీ సిలిండర్ల డెలివరీలో నిర్ణీత కేటాయింపులు చేసే అవకాశాలు లేకపోలేదు.

సింగిల్ సిలిండర్ వారికి ప్రాధాన్యత

వినియోగదారులు చాలామంది డబుల్ సిలిండర్స్, సింగిల్ సిలిండర్లు ఉపయోగిస్తారు. ఎల్పీజీ కొరత భయాల నేపథ్యంలో ముందు ముందు డబుల్ సిలిండర్ ఉన్నవారి కంటే సింగిల్ సిలిండర్ ఉండే వారికే ప్రాధాన్యత ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.

డబుల్ సిలిండర్ ఉన్నవారి కంటే వీరికే ప్రాధాన్యత

డబుల్ సిలిండర్ ఉన్నవారి కంటే వీరికే ప్రాధాన్యత

ప్రస్తుతం ఎల్పీజీ కొరతలేదని, సౌదీ అరామ్‌కోతో పాటు ఓఎన్జీసీ ఉరన్ ప్లాన్ ఇష్యూ నేపథ్యంలో సరఫరాలో ఇబ్బందులు రావొచ్చునని, అయినప్పటికీ డిమాండ్‌కు అవసరమైనమేర సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీకి చెందిన సీనియర్ ఎల్పీజీ అధికారి ఒకరు చెప్పారని తెలుస్తోంది. అయితే తాము డబుల్ సిలిండర్ ఉన్న వారికంటే సింగిల్ సిలిండర్ ఉన్నవారికి అధిక ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. ఎల్పీజీ కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామని, వారంలో ఇది భారత్‌కు చేరుకుంటుందని తెలిపారు.

ఉత్పత్తిపై ప్రభావం

ఉత్పత్తిపై ప్రభావం

ఇటీవల ఉరన్ ప్లాంటులో ఫైర్ యాక్సిడెంట్, సౌదీ చమురు క్షేత్రాలపై డ్రోన్ దాడులు జరిగిన విషయం తెలిసిందే. భారత్‌కు క్రూడ్, కుకింగ్ గ్యాస్ సరఫరా చేసే రెండో అతిపెద్ద దేశం సౌదీ. డ్రోన్ దాడి నేపథ్యంలో ఉత్పత్తిపై ప్రభావం పడుతోంది. అలాగే, మంగళూరు రిఫైనరీ అండ్ పెట్రో కెమికల్స్ (MRPL)లోని కొన్ని యూనిట్లు వివిధ ఇష్యూల కారణంగా ఇటీవల మూతపడ్డాయి. భారత్‌లో ఎల్పీజీ కస్టమర్లు అందరూ కలిసి 273 మిలియన్లు ఉన్నారు.

త్వరలో భారత్‌కు కార్గో

త్వరలో భారత్‌కు కార్గో

మరోవైపు, రానున్న పండుగ సీజన్‌లో గ్యాస్ కొరత ఏదీ ఉండదని ఆయిల్ మినిస్ట్రీ అధికారులు చెబుతున్నారు. త్వరలో భారత్‌కు కార్గో రానుందని తెలిపారు. భారత్‌లో ఎల్పీజీ ఉపయోగం 2016లో 62 శాతం ఉండగా ఇప్పుడు 95 శాతానికి పెరిగింది. ఇప్పటికే మహారాష్ట్ర, కర్ణాటక, పంజాబ్, గోవా రాష్ట్రాల్లో ఎల్పీజీ బుకింగ్, సరఫరా సమస్యలు ఎదుర్కొంటున్నారట.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here