బీఎస్ఎన్ఎల్ లో ఎంతకాలం ఈ పరిస్థితి?

0
1


బీఎస్ఎన్ఎల్ లో ఎంతకాలం ఈ పరిస్థితి?

భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ ( బీఎస్ఎన్ఎల్) ప్రభుత్వ రంగంలో అతిపెద్ద టెలికాం సర్వీసుల సంస్థ. విస్తృత స్థాయిలో నెట్ వర్క్, భారీ స్థాయిలో ఉద్యోగులు, ఆస్తులు. ప్రైవేట్ కంపెనీలకు గట్టి పోటీనిచ్చిన సంస్థ. కొంతకాలం పోటీలో వెనకడుగు వేసినా ఇప్పుడు మళ్ళీ పుంజుకుంటోంది. కానీ ఆర్ధిక సమస్యలు మాత్రం ఈ సంస్థను వెంటాడుతున్నాయి. ఏ స్థాయిలో అంటే ఉద్యోగులకు వేతనాలు నిర్దేశిత కాలంలో చెల్లించలేని పరిస్థితి. ఈ సంస్థలో 1.65 లక్షలకు పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. జులై నెలకు సంబంధించిన వేతనాలను ఆగస్టు 5వ తేదీన చెల్లించింది. గత కొన్ని నెలలుగా వేతనాలను సకాలంలో చెల్లించలేక పోతోంది. ఎలాగోలా నిధులు సమకూర్చుకొని వేతనాలు చెల్లిస్తోంది. అయితే ఇంకా ఇలాంటి పరిస్థితి ఎంతకాలం ఉంటుందోనని పరిశ్రమ విశ్లేషకులు అంటున్నారు.

వేతనాలకు కష్ఠాలు

* ప్రభుత్వ రంగంలోని మహానగర్ టెలిఫోన్ నిగమ్ లిమిటెడ్ (ఎంటీఎన్ఎల్ ), బీఎస్ఎన్ఎల్ లు నష్ఠాలతో సావాసం చేస్తున్నాయి.

* ఈ రెండు కంపెనీలు కూడా ఫిబ్రవరి కి సంబంధించిన వేతనాలను మార్చి మధ్య కాలంలో చెల్లించాయి. తగినంతగా నిధులు లేక పోవడమే ఇందుకు కారణం.

* అంతర్గతంగా నిధులు సమకూర్చుకొని చివరకు వేతనాలు చెల్లించాయి.

పునరుజ్జివానికి ప్రయత్నాలు

పునరుజ్జివానికి ప్రయత్నాలు

* పునరుజ్జివన ప్యాకేజీ ద్వారా ఈ రెండు కంపెనీలను కష్టాల నుంచి బయట పడేయాలని టెలికం విభాగం ప్రయత్నాలు చేస్తోంది.

* ఇందులో భాగంగా స్వచ్చంద పదవీ విరమణ పథకం, ఆస్తుల విక్రయం, 4జీ స్పెక్ట్రమ్ కేటాయింపు వంటివి చేయాలనుకుంటున్నారు.

* ఏంటీఎన్ఎల్ ను బీఎస్ఎన్ఎల్ లో విలీనం చేయాలన్న ప్రతిపాదన ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి.

* బీఎస్ఎన్ఎల్ సరికొత్త పథకాలు తెస్తూ కొత్త కస్టమర్లను బాగా ఆకట్టుకుంటోంది. నెట్ వర్క్ ను విస్తరించుకుంటూ పోతున్న కారణంగా ఇతర కంపెనీల కస్టమర్లు కూడా బీఎస్ఎన్ఎల్ కు మారుతున్నారు.

నష్టాలు

నష్టాలు

* బీఎస్ఎన్ఎల్, ఏంటీఎన్ఎల్ నష్టాలతో నడుస్తున్నాయి. 2018-19 సంవత్సరంలో బీఎస్ఎన్ఎల్ నష్టం రూ. 14,000 కోట్లు, రాబడి రూ. 19,308 కోట్లకు తగ్గినట్టు అంచనా.

* 2015-16లో నష్టం రూ. 4,859 కోట్లు, 2016-17లో రూ. 4,793 కోట్లు, 2017-18లో రూ. 7,993 కోట్లు గా నమోదైనట్టు ప్రభుత్వం వెల్లడించింది.

* బీఎస్ఎన్ఎల్ లో 1,65,179 మంది ఉద్యోగులు ఉన్నారు. కంపెనీ మొత్తం ఆదాయంలో ఉద్యోగుల వేతన వ్యయాల కోసం 75 శాతం ఖర్చు చేయాల్సి వస్తోందట.

* బీఎస్ఎన్ఎల్ తో పోల్చితే ప్రయివేట్ రంగంలోని కంపెనీల్లో ఉద్యోగుల సంఖ్య వారికి చెల్లించే వేతనాలు చాలా తక్కువ స్థాయిలో ఉంటున్నాయి. దీనివివల్లనే ఆయా కంపెనీలు మనగలుగుతున్నాయి.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here