బీడీ పరిశ్రమపై ఆంక్షలు ఎత్తివేయాలి

0
3


బీడీ పరిశ్రమపై ఆంక్షలు ఎత్తివేయాలి

సమావేశంలో మాట్లాడుతున్న సిద్ధిరాములు

కామారెడ్డి గ్రామీణం, న్యూస్‌టుడే: బీడీ పరిశ్రమపై ప్రభుత్వం ఆంక్షలు ఎత్తివేయాలని తెలంగాణ బీడీ సిగార్‌ వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షుడు సిద్ధిరాములు పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలో గురువారం తెలంగాణ బీడీ సిగార్‌ వర్కర్స్‌, సీఐటీయూ జిల్లా ప్రథమ మహాసభలో ఆయన మాట్లాడారు. బీడీ పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్న కార్మికులకు చేతి నిండా పనిలేక ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని, షరతులు లేకుండా కార్మికులకు జీవనభృతి అందజేయాలన్నారు. సమస్యల పరిష్కారానికి మలిదశ పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో జిల్లా అధ్యక్షుడు ఎల్లయ్య, కార్యదర్శి సదానందం, చంద్రమౌళి, సత్యం, గంగమణి, లక్ష్మి, రాధ, రజినీకాంత్‌, మార్కండేయ, శేఖర్‌ పాల్గొన్నారు.



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here