బీసీ.. ఎదురుచూసి

0
1


బీసీ.. ఎదురుచూసి

● ఆరేళ్లకాలంలో మూడేళ్లే పంపిణీ

● కార్పొరేషన్‌ రుణాల మంజూరులో జాప్యం

● స.హ. చట్టంతో వెలుగుచూసిన నిజాలు

న్యూస్‌టుడే, వెల్మల్‌, ఇందూరు

సొంతకాళ్లపై నిలబడాలనే తపన, జీవితంలో ఎదగాలనే ఆశ ఉన్న వెనుకబడిన వర్గాలు మరింత వెనుకబాటుకు గురవుతున్నాయి. ప్రభుత్వాల నిర్లక్ష్యం, ప్రజాప్రతినిధుల లోపాయికారీతనం, అధికారుల అవినీతి, బ్యాంకర్ల అలసత్వం.. వెరసీ స్వయం ఉపాధి కోసం ఎదురుచూస్తున్న యువత కాళ్లకు పగ్గాలు పడుతున్నాయి. ఆరేళ్లలో కేవలం మూడు సార్లు మాత్రమే రుణాలు మంజూరయ్యాయి. 2018-19 సంవత్సరానికి రుణ ప్రకటన జరగలేదు. 2019-20కు సంబంధించి ప్రణాళిక ఇంకా కార్యరూపం దాల్చలేదు.

2015-16 నుంచి బీసీ కార్పొరేషన్‌ కింద 80 శాతం రాయితీ ఇస్తామని ప్రకటించడంతో నిరుద్యోగులు వేలాది మంది దరఖాస్తు చేసుకున్నారు. ఆరేళ్లలో కేవలం మూడేళ్లు మాత్రమే ప్రక్రియ కొనసాగింది. అందులోనూ 3,991 యూనిట్లు లక్ష్యం ఉండగా 2,006 యూనిట్లకే మంజూరు దొరికింది. అందులోరే 1,237 మందికి మాత్రమే అవకాశం దక్కింది.

అతి తక్కువ అడిగితేనే..

2017-18లో రుణాల కోసం దరఖాస్తులు చేసుకోమంటే ఎన్నికల నేపథ్యంలో రూ.50 వేల నుంచి రూ.10 లక్షల వరకు రాయితీతో కూడిన బ్యాంకు రుణమిస్తారని వేలాది మంది ఆశించారు. అందులో కేవలం రూ.50 వేలు అడిగిన వారికే ప్రాధాన్యం ఇచ్చి అధికారులు చేతులు దులుపేసుకోవడంతో నిరుత్సాహానికి గురయ్యారు. చిన్న మొత్తాన్నైనా ఇవ్వాలంటే స్థానిక నేతల పైరవీలకే ప్రాధాన్యమిచ్చారు. మిగతావారందరిని పక్కన బెట్టారు. ఇప్పటికీ వాటికి మోక్షం లేదు.

రెండేళ్లుగా ఎదురుచూస్తున్నా

– చక్రాల భాస్కర్‌, ఘన్‌పూర్‌, డిచ్‌పల్లి మండలం

ఆటోమోబైల్‌ దుకాణం కోసం కార్పొరేషన్‌ రుణం ఇస్తారని రెండేళ్లుగా ఎదురుచూస్తున్నా. దరఖాస్తు చేసుకున్నప్పటి నుంచి ఇప్పటివరకు కనీసం ఇంటర్వ్యూకి పిలువలేదు. రూ.5 లక్షల రుణమిస్తేనే ఆర్థికంగా వ్యాపారంలో నిలదొక్కుకునే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం నాలాంటి వారికోసం ఇప్పటికైనా రుణాల మంజూరు పరిశీలించాలి.

ఇచ్చే కొద్దీ మందిలో అర్హులకు ఎంత మందికి అందాయనేది ప్రశ్నార్థకంగానే మిగిలింది. ఎందుకంటే బ్యాంకులు గ్యారంటీ చూసుకుంటాయి. నేతలు అనుచరులు, అనుయాయులను వెదుక్కుంటారు. ఈ నేపథ్యంలో అసలైన లబ్ధిదారులకు రుణాలు అందనంత దూరంలో ఉంటున్నాయి. ఉదాహరణకు జక్రాన్‌పల్లి మండలకేంద్రంలోని అప్పటి ప్రజాప్రతినిధి తన బంధువర్గానికి నాలుగు యూనిట్లు మంజూరు చేయించుకున్నారనే ఆరోపణలున్నాయి. అలాగే మండలంలోని ఓ మేజర్‌ గ్రామంలో మాజీ ప్రజాప్రతినిధి తన కులసంఘం సభ్యులకు ఆరు యూనిట్లు కట్టబెట్టేలా చక్రం తిప్పారనే విమర్శలున్నాయి. ఇలా జిల్లాలోని అనేక చోట్ల అక్రమార్కులు అందినకాడికి దండుకొన్నారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here