బూటకపు ఎన్‌కౌంటర్‌పై విచారణ జరిపించాలి

0
0



నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆదివాసుల హక్కుల పోడు భూముల రక్షణకై పోరాడిన సిపిఐ ఎంఎల్‌ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కామ్రేడ్‌ లింగన్న ను బూటకపు ఎన్‌కౌంటర్‌లో పోలీసులు కాల్చి చంపడాన్ని నిరసిస్తూ సీపీఐ ఎంఎల్‌ న్యూ డేమోక్రసి ఆధ్వర్యంలో ఆర్డీవో కార్యాలయం ముందు ప్రదర్శన నిర్వహించి వినతిపత్రం సమర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి దళ కమాండర్‌ కామ్రేడ్‌ లింగన్న ఆదివాసీల భూముల కోసం పోరాటం చేస్తే పోలీసులు చుట్టుముట్టి ఎన్‌కౌంటర్‌ పేరిట పోలీసులు కాల్చి చంపారని దీనిపై న్యాయ విచారణ చేపట్టాలని, ఘటనలో పాల్గొన్న పోలీసులపై హత్య నేరం కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో సబ్‌ డివిజన్‌ కార్యదర్శి ముత్తన్న, గంగారాం, శివాజీ, పివైఎల్‌ రాష్ట్ర కార్యదర్శి కిషన్‌, ఠాకూర్‌, సుమన్‌, సూరిబాబు, శ్రీను, ఇస్తారి రమేశ్‌ తదితరులు పాల్గొన్నారు.



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here