బెట్టింగ్ బాబుల ఓటు ఎటు? ఆ జ‌ట్టుపై పందెం గెలిస్తే జాక్ పాట్ కొట్టిన‌ట్టే!

0
3


ముంబై: ప్ర‌పంచ‌క‌ప్ టోర్న‌మెంట్ సెమీ ఫైన‌ల్‌, ఫైన‌ల్ మ్యాచ్‌లు ద‌గ్గ‌ర‌కొస్తున్న కొద్దీ బెట్టింగ్ బాబులు జోరందుకున్నారు. రెండు సెమీఫైన‌ల్ మ్యాచ్‌ల‌తో స‌హా ఫైన‌లిస్టులు, క‌ప్ కొట్టే టీమ్‌ల‌పై బెట్టింగులు కాస్తున్నారు. భార‌త క్రికెట్ జ‌ట్టు మంగ‌ళ‌వారం తొలి సెమీఫైన‌ల్‌ను ఆడ‌బోతున్న నేప‌థ్యంలో- ఆన్‌లైన్ బెట్టింగ్ వెబ్‌సైట్ల‌న్నీ సంద‌డిగా మారాయి. బెట్టింగ్ రేట్ల‌తో హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. దాదాపు అన్ని ఆన్‌లైన్ బెట్టింగ్ వెబ్‌సైట్లన్నీ టీమిండియా వైపే మొగ్గు చూపుతుండ‌టం కొస‌మెరుపుగా చెప్పుకోవ‌చ్చు. కోహ్లీసేన ఈ సారి ప్ర‌పంచ‌క‌ప్‌ను ఎగురేసుకెళ్తుంద‌ని చెబుతున్నాయి.

 సెమీస్‌లో గెలిచేది కూడా భార‌తే..

సెమీస్‌లో గెలిచేది కూడా భార‌తే..

మాంచెస్ట‌ర్‌లోని ఓల్డ్ ట్రాఫొర్డ్ స్టేడియంలో మంగ‌ళ‌వారం జ‌రిగే తొలి సెమీఫైన‌ల్‌లో గెలిచేది భార‌త జ‌ట్టేన‌ని తేల్చి చెబుతున్నాయి బెట్టింగ్ వెబ్‌సైట్లు. ఈ మేర‌కు ల్యాడ్‌బ్రోక్స్‌, బెట్‌వే, కోర‌ల్‌, విలియ‌మ్ హిల్‌ వంటి ఆన్‌లైన్ బెట్టింగ్ వెబ్‌సైట్లు టీమిండియాకే జై కొడుతున్నాయి. దీనికి అనుగుణంగా- బెట్టింగ్ రేట్ల‌ను నిర్ధారించాయి. ల్యాడ్‌బ్రోక్ వెబ్‌సైట్ టీమిండియాకు 8/13 రేటు బెట్టింగ్ రేటును నిర్ధారించింది. 13-8 బెట్టింగ్ అంటే.. మ‌నం బెట్టింగ్ పెట్టిన‌ మొత్తాన్ని 13 తో గుణించిన త‌ర్వాత ఆ మొత్తాన్ని మ‌ళ్లీ ఎనిమిది డివైడ్ చేస్తారు.

రూ. ల‌క్ష‌కు రూ.2.26 ల‌క్ష‌లు

రూ. ల‌క్ష‌కు రూ.2.26 ల‌క్ష‌లు

ఉదాహ‌ర‌ణ‌కు- టీమిండియా గెలుస్తుంద‌ని ల‌క్ష రూపాయ‌ల మొత్తాన్ని పందెంగా పెడితే- టీమిండియా గెలిస్తే.. మ‌న చేతికి 2, 26, 500 రూపాయ‌లు అందుతుంద‌న్న‌మాట‌. ల‌క్ష రూపాయ‌ల‌ను మొద‌ట 13తో హెచ్చింపు చేస్తారు. అనంత‌రం వ‌చ్చిన మొత్తాన్ని ఎనిమిదితో భాగాహారం చేస్తారు. భాగాహారం చేయ‌డం వ‌ల్ల వ‌చ్చిన మొత్తానికి ల‌క్ష రూపాయ‌ల‌ను అద‌నంగా క‌లుపుతారు. ఇలా చేయ‌డం వ‌ల్ల ల‌క్ష రూపాయ‌ల బెట్టింగ్ కాసి, గెలిస్తే 2, 26, 500 రూపాయలు మ‌న‌కు అందుతాయి. ఇలా- ఇంగ్లండ్‌పై 8/15, ఆస్ట్రేలియాపై 4/11, న్యూజిలాండ్‌పై 1/8 తేడాతో బెట్టింగ్ రేట్‌ను ప్ర‌తిపాదించింది.

ఆట‌గాళ్ల‌పైనా బెట్టింగే..

ఆట‌గాళ్ల‌పైనా బెట్టింగే..

టోర్న‌మెంట్‌లో ఎవ‌రు అత్య‌థిక ప‌రుగులు చేస్తార‌నే విష‌యంపైనా బెట్టింగ్ రేటును నిర్ధారించారు. ఇందులో- రోహిత్ శ‌ర్మ‌కే అత్య‌ధిక బెట్టింగ్ రేట్‌ను నిర్దారించాయి ఆ వెబ్‌సైట్లు. రోహిత్ శ‌ర్మ‌పై ల్యాడ్‌బ్రోక్స్ 8-13 రేట్‌ని ఫిక్స్ చేసింది. ఆ త‌ర్వాత స్థానంలో ఆసీస్ ఓపెన‌ర్ వార్న‌ర్‌పై 11-8 రేట్‌ను ప్ర‌తిపాదించాయి.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here