బెదిరిస్తే భయపడాల్సిన అవసరం లేదు

0
0


బెదిరిస్తే భయపడాల్సిన అవసరం లేదు

నిరాహార దీక్షలో కూర్చున్న ఆర్టీసీ కార్మికులు

నిజామాబాద్‌ అర్బన్‌, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆర్టీసీ కార్మికులను బెదిరిస్తే సమ్మె విషయంలో భయపడాల్సిన అవసరం లేదని సీఐటీయూ రాష్ట్ర నాయకుడు భాస్కర్‌ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలో కలెక్టరేట్‌ ఎదుట ఆర్టీసీ కార్మికులు నిరాహార దీక్ష ప్రారంభించారు. ఇందులో ఆయన మాట్లాడుతూ… గతంలో మున్సిపల్‌ కార్మికులకు సైతం ఇదే తరహా బెదిరింపులకు గురిచేశారన్నారు. చివరకు ఏమీ చేయలేకపోయారని పేర్కొన్నారు. కలిసికట్టుగా పోరాడితే తప్పకుండా ముఖ్యమంత్రి దిగిరావాల్సిందేనన్నారు. సమస్యలు పరిష్కరించే వరకు సమ్మెవిరమించేది లేదన్నారు. అనంతరం ఐకాస నాయకులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కావాలనే డెడ్‌లైన్‌ విధించడం సరికాదన్నారు. ఆదివారం నుంచి పది రోజుల పాటు కలెక్టరేట్‌ ఎదుట నిరాహార దీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. ప్రతి రోజు ఆర్టీసీ కార్మికులు ఇక్కడే కూర్చుంటారన్నారు. దీక్షలో హైమద్‌అలీ, సాయిలు, నాగరాజు, ఎంవీ రెడ్డి, సీహెచ్‌వీ కుమార్‌, రమణ, నాగకుమారి, సంజీవ్‌, సుందరమ్మ తదితరులు ఉన్నారు.



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here