బెల్లంకొండ ఇంటి నుంచి కొత్త హీరో.. లవర్ బోయ్‌గా వస్తోన్న గణేష్

0
2


ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ ఇంటి నుంచి మరో హీరో వస్తున్నారు. ఇప్పటికే సురేష్ పెద్ద కుమారుడు సాయి శ్రీనివాస్ హీరోగా పరిచయమయ్యారు. శ్రీనివాస్‌ను కమర్షియల్ హీరోగా ఎస్టాబ్లిష్ చేయడానికి మొదటి నుంచి మంచి మాస్ సినిమాలు చేయించారు. శ్రీనివాస్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు కానీ, ఇంకా బలమైన మార్కెట్ అయితే ఏర్పరుచుకోలేదు.

ఇదిలా ఉంటే, ఇప్పుడు సురేష్ రెండో కుమారుడు, సాయి శ్రీనివాస్ తమ్ముడు గణేష్ హీరోగా పరిచయం కాబోతున్నారు. లవర్ బోయ్‌గా తెలుగు ప్రేక్షకులను పలకరించబోతున్నారు. ‘ప్రేమ ఇష్క్ కాదల్’, ‘సావిత్రి’ చిత్రాల దర్శకుడు పవన్ సాదినేని దర్శకత్వంలో గణేష్ బెల్లకొండ తన తొలిచిత్రం చేస్తున్నారు. ఇదొక ప్రేమకథా చిత్రం. బీటెల్ లీఫ్ ప్రొడక్షన్స్, లక్కీ మీడియా సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

ఈ సినిమా ప్రారంభోత్సవం అక్టోబర్ 5న హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో జరగనుంది. ఉదయం 8 గంటలకు ముహూర్తం ఖరారు చేశారు. దీనికి సంబంధించి ఇన్విటేషన్ పోస్టర్లు కూడా విడుదల చేశారు. వాటిలో ఒక పోస్టర్లలో గణేష్ పుస్తకాలు ముందేసుకుని ప్రేయసి గురించి ఆలోచిస్తున్నట్టు మరో లోకంలో ఉన్నారు. పక్కనే గోల్డ్ స్పాట్ కూల్ డ్రింక్ బాటిల్ ఉంది. అంటే ఇది కచ్చితంగా 90ల్లో ప్రేమకథ.

అయితే, మరో పోస్టర్‌లో యాపిల్ ల్యాప్‌టాప్‌ను చూస్తూ క్లాస్ లుక్‌లో కనిపించారు గణేష్. ఈ పోస్టర్లు, ఆ లుక్స్ చూస్తుంటే ఇది రెండు కాలాల్లో జరిగిన కథగా అనిపిస్తోంది. పూర్తి వివరాలు తెలియాలంటే రెండు రోజులు ఆగాల్సిందే. కాగా, ఈ సినిమాకు రథన్ సంగీతం సమకూర్చనున్నారు. కార్తిక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ అందించనున్నారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here