బెల్లంకొండ కాంపౌండ్ నుండి మరొక హీరో..మళ్ళీ అదే ఖర్చు?

0
2


బెల్లంకొండ సాయి శ్రీనివాస్..వస్తూ వస్తూనే అల్లుడు శీను అనే భారీబడ్జెట్ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమాలో సమంత నటించడానికి ఏకంగా రెండున్నర కోట్లు ఇచ్చారు అని టాక్. అలాగే వినాయక్ ఆ సినిమా చెయ్యడానికి పది కోట్లు పుచుకున్నాడు అని కూడా గుసగుసలాడారు. అంతేకాదు ఆ సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నా ఒక సాంగ్‌లో ఆడిపాడడానికి కూడా బాగానే తీసుకుంది. అలా అతని మొదటి సినిమా చాలా విషయాల్లో టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది. 40 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఆ సినిమా హిట్ అనిపించుకున్నా కూడా కాస్ట్ ఫెయిల్యూర్‌గా మిగిలింది. అయినా కూడా బెల్లంకొండ సురేష్ మాత్రం తన కొడుకుని ప్రోమోట్ చేసుకునే విషయంలో మాత్రం ఎక్కడా తగ్గలేదు.

Also Read: త్రివిక్రమ్‌ను థ్రిల్ చేసిన ‘రాగల 24 గంటల్లో’ టీజర్

వరుసగా బయటి ప్రొడ్యూసర్స్ కూడా బెల్లంకొండ శ్రీనివాస్‌తో భారీ బడ్జెట్ సినిమాలే చేసారు. అయితే బ్యాక్ డోర్‌లో సురేష్ డబ్బు సర్దుబాటు చేసేవాళ్ళు అనే టాక్ ఉండేది. అయినా కూడా బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాలు వరుసగా ఫెయిల్ అయ్యాయి. అనుకోకుండా తమిళ్‌లో హిట్ అయిన రాచ్చసన్ సినిమాని తెలుగులో రీమేక్ చెయ్యాలి అనుకుంటే బెల్లంకొండ హీరో ఒప్పుకున్నాడు. కానీ ఆ సినిమాపై ముందు ఎవ్వరికి పెద్ద అంచనాలు లేవు, హీరోకి కూడా. కానీ ఆ సినిమా రిలీజ్ అయ్యింది, సూపర్ హిట్ అనిపించుకుంది. సినిమా కొనుకున్నవాళ్ళకి లాభాలు వచ్చాయి. దాంతో ఇప్పుడు శ్రీనివాస్‌ని బయటి ప్రొడ్యూసర్స్ కి వదిలేసి తన రెండో కొడుకు గణేష్‌ని కూడా హీరో గా దింపడానికి ప్రిపేర్ అవుతున్నాడు బెల్లంకొండ సురేష్.

Also Read: రేణు దేశాయ్ సాక్షిగా.. రష్మికోసం సుధీర్ ఐదేళ్లు కాదు, ఐదొందల ఏళ్లైనా ఆగుతాడట!

గతంలో కొన్ని సినిమాలకు ప్రొడ్యూసర్‌గా వ్యవహరించిన బెల్లంకొండ గణేష్ ఇప్పుడు హీరోగా వస్తున్నాడు. అతని మొదటి సినిమాకి గతంలో సావిత్రి సినిమాని తెరకెక్కించిన పవన్ సాధినేని డైరెక్టర్. ప్రేమ ఇష్క్ కాదల్ సినిమాతో డైరెక్టర్‌గా పరిచయం అయిన పవన్ సాధినేని గత కొంతకాలంగా కళ్యాణ్ రామ్‌తో సినిమా చెయ్యాలి అని చాలా ట్రై చేసాడు. కానీ అది వర్క్ అవుట్ కాలేదు. కానీ ఇప్పుడు మాత్రం ఈ భారీ ఆఫర్ దక్కించుకున్నాడు. ఈ సినిమాని కూడా మరీ అల్లుడు శీను అంత లావిష్‌గా కాకపోయినా కాస్త భారీ సినిమాగానే తెరకెక్కించడానికి రెడీ అవుతున్నారు అని ఇండస్ట్రీ‌లో టాక్ వినిపిస్తుంది. మరి ఈ బాబు అయిన మొదటి సినిమాతోనే హిట్ అందుకుని సెటిల్ అయిపోతే పర్లేదు. లేదంటే మాత్రం మళ్ళీ ఆ భారీ ప్రొడ్యూసర్ భారీ సినిమాలు సెట్ చెయ్యడానికి కాస్త కష్టపడాల్సిందే.

Also Read: Sye Raa Climax: ‘సైరా’ క్లైమాక్స్‌లో పవన్.. చిరు ప్లేస్‌లో అనుష్కSource link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here