బొట్టు బొట్టు.. ఒడిసి పట్టాలి

0
0


బొట్టు బొట్టు.. ఒడిసి పట్టాలి

జిల్లా వ్యవసాయాధికారి నాగేంద్రయ్య

కిసాన్‌ మేళాలో మాట్లాడుతున్న జిల్లా వ్యవసాయాధికారి నాగేంద్రయ్య

మాచారెడ్డి, న్యూస్‌టుడే: ఆకాశం నుంచి భూమిపై పడే ప్రతి బిందువును ఒడిసి పట్టి భూగర్భంలోకి ఇంకించాలని జిల్లా వ్యవసాయాధికారి నాగేంద్రయ్య పిలుపునిచ్చారు. మాచారెడ్డి మండల కేంద్రంలో శుక్రవారం కృషి విజ్ఞాన కేంద్రం రుద్రూర్‌, వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జలశక్తి అభియాన్‌ కిసాన్‌ మేళాలో పాల్గొని ప్రసంగించారు. ఆరుతడి పంటలకు ప్రాధాన్యమివ్వాలని సూచించారు. వాణిజ్య, ఉద్యాన పంటలపై దృష్టి సారించాలన్నారు. బిందు, తుంపర సేద్యానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. డీఆర్‌డీవో చంద్రమోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. వట్టిపోయిన నీటి వనరుల్లో నీటి ఊటలు పుట్టించే చర్యలకు శ్రీకారం చుట్టాలని సూచించారు. ఇందుకు ప్రభుత్వం అనేక రాయితీలు కల్పిస్తోందన్నారు. ప్రతి ఒక్కరు ఇంకుడు గుంతల తవ్వకంతో పాటు సామాజిక ఇంకుడు గుంతల ఏర్పాటుకు ముందుకు రావాలని పేర్కొన్నారు. చెక్‌డ్యాంల నిర్మాణం, కందకాల తవ్వకం, చెరువులు-కుంటల్లో పూడిక తొలగించడం, ఫాంపాండ్ల ఏర్పాటుకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. హరితహారంలో నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలన్నారు. ప్రభుత్వం చేపడుతున్న ప్రతి కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు, ప్రజలు తమవంతు సహకారం అందించాలని మాచారెడ్డి ఎంపీపీ నర్సింగ్‌రావు పేర్కొన్నారు. కార్యక్రమంలో రుద్రూర్‌ కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త బాలాజీ నాయక్‌, ఆత్మ కమిటీ ఛైర్మన్‌ నర్సింహారెడ్డి, జడ్పీటీసీ సభ్యుడు మినుకూరి రాంరెడ్డి, వైస్‌ ఎంపీపీ జీడిపల్లి నర్సింహారెడ్డి, కామారెడ్డి మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌ గోపిగౌడ్‌, రైసస మండల కన్వీనర్‌ భుక్యా నర్సింలు, సర్పంచులు లలిత, హంజీనాయక్‌, ఎంపీటీసీ సభ్యురాలు వినోద తదితరులు పాల్గొన్నారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here