బోరుపైపు తగిలి ఒకరి మృతి

0
5


బోరుపైపు తగిలి ఒకరి మృతి

బిచ్కుంద,న్యూస్‌టుడే: బిచ్కుంద మండలం పెద్దదడ్గిలో ప్రమాదవశాత్తు బోరు పైపు తగిలి ఒకరు మృతి చెందినట్లు ఎస్సై కృష్ణ తెలిపారు. ఎస్సై కథనం ప్రకారం ఆదివారం పెద్దదడ్గి గ్రామానికి చెందిన రైతు అనీఫ్‌ వ్యవసాయ పొలంలో బోరుకు మరమ్మతులు చేయడానికి షేక్‌ ఫరీద్‌ (22) వెళ్లారు. పైపులు పైకి తీస్తున్న సమయంలో పైపు గొంతు సమీపంలో దిగడంతో తీవ్ర గాయం అయ్యింది. దాంతో అక్కడ ఉన్న రైతులు వెనువెంటనే బాన్సువాడ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఫరీద్‌ మృతి చెందినట్లు వైద్యులు చెప్పారని ఎస్సై వెల్లడించారు.

https://betagallery.eenadu.net/htmlfiles/126664.html

ప్రధానాంశాలు



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here