బ్యాంకులపై ఆర్బీఐ కొరడా: నిబంధనలు పాటించనందుకు భారీగా జరిమానాలు

0
5


బ్యాంకులపై ఆర్బీఐ కొరడా: నిబంధనలు పాటించనందుకు భారీగా జరిమానాలు

నిబంధనలు పాటించని ప్రభుత్వరంగ బ్యాంకులపై భారత రిజర్వ్ బ్యాంకు (ఆర్ బీ ఐ) కొరడా ఝళిపిస్తోంది. భారీ మొత్తంలో జరిమానాలు విధిస్తోంది. ఈ బ్యాంకులు నిర్దేశిత నిబంధనల మేరకు వ్యవహరించకపోవడమే జరిమాణాలకు కారణం.

ఇవీ జరిమానాలు

* అలహాబాద్ బ్యాంకు, బ్యాంక్ అఫ్ మహారాష్ట్రలకు రూ.2 కోట్ల చొప్పున, బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్ సీస్ బ్యాంక్, యునైటెడ్ బ్యాంకు అఫ్ ఇండియా లకు రూ. 1.5 కోట్ల చొప్పున, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ కు రూ. 1 కోటి జరిమానాను విధించింది. కరెంట్ ఖాతా లను ప్రారంభించడంలో అనుసరించాల్సిన నిబంధనలు ఈ బ్యాంకులు పాటించకపోవడం వల్లనే జరిమానాలు విధించినట్టు ఆర్ బీ ఐ వెల్లడించింది. ఖాతాలు ప్రారంభించడంలో నిబంధనలు పాటించలేదని ఆర్ బీ ఐ గుర్తించి వీటికి సంబంధించి వివరణ ఇవ్వాలని బ్యాంకులకు షోకాజ్ నోటీసు జారీ చేసింది. దీనికి బ్యాంకులు ఇచ్చిన వివరణను పరిశీలించిన తర్వాత ఒక నిర్ణయానికి వచ్చి బ్యాంకులకు ఆర్ బీ ఐ జరిమానాలు విధించింది.

* బ్యాంకులకు సంబంధించిన సైబర్ సెక్యూరిటీ నిబంధనలు, మోసాల వర్గీకరణ, రిపోర్టింగ్ కు సంబంధించిన నిబంధనలు పాటించనందుకు కార్పొరేషన్ బ్యాంకుకు రూ. కోట్ల జరిమానాను విధించింది.

* నిబంధనలు పాటించని స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ అఫ్ బరోడాలకు కూడా ఆర్బీఐ జరిమానాలు విధించింది.

* మోసాలను ప్రకటించడంలో జాప్యం చేసినందుకు ఆర్బీఐ జరిమానా విధించినట్టు తొమ్మిది బ్యాంకులు వెల్లడించాయి.

* కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ ఖాతాల విషయంలో మోసాన్ని వెల్లడించడంలో జాప్యం చేసినందుకు పంజాబ్ నేషనల్ బ్యాంకుకు ఆర్బీఐ రూ.50 లక్షల జరిమానాను విధించింది.

* కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ విషయంలోనే మోసాన్ని వెల్లడించడంతో జాప్యం చేసిన కారణంగా ఓరియంటల్ బ్యాంక్ అఫ్ కామర్స్ కు రూ. 1.5 కోట్ల జరిమానా పడింది. ఆర్బీఐ ఆదేశాలు అందిన 14 రోజుల్లో ఈ జరిమానాను చెల్లించాల్సి ఉంటుంది.

* యునైటెడ్ బ్యాంక్ అఫ్ ఇండియా, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంకులకు రూ. కోటిచొప్పున జరిమానా పడింది.

* మోసాలకు సంబంధించిన నిబంధనలు పాటించనందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు రూ.50 లక్షల జరిమానాను ఆర్బీఐ విధించింది.

* బ్యాంక్ ఆఫ్ బరోడా, ఫెడరల్ బ్యాంక్ లకు రూ. 50 లక్షలు, కార్పొరేషన్ బ్యాంకు, యూకో బ్యాంక్లకు కూడా జరిమానా పడింది.

నిఘాపెట్టిన ఆర్బీఐ

* ప్రభుత్వ రంగ బ్యాంకులు చిన్న పొరపాట్లు చేసినా ఆర్బీఐ సహించడం లేదు.

* బ్యాంకులు నిబంధనలు పాటించడంలో నిర్లక్ష్యం పాటించడం వల్ల మోసాలకు అవకాశం ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలో నిబంధనలను ఉల్లంఘించే బ్యాంకులకు భారీగా జరిమానాలు విధిస్తోంది.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here