బ్యాంకుల హాలీడే అలర్ట్: ఆగస్ట్‌లో 11 రోజులు క్లోజ్! చెక్ చేసి ప్లాన్ చేసుకోండి

0
1


బ్యాంకుల హాలీడే అలర్ట్: ఆగస్ట్‌లో 11 రోజులు క్లోజ్! చెక్ చేసి ప్లాన్ చేసుకోండి

న్యూఢిల్లీ: ఆగస్ట్ నెలలో పలు సందర్భాలలో బ్యాంకులు క్లోజ్ అవుతాయి. స్వాతంత్ర దినోత్సవం, రక్షా బందన్, బక్రీద్, శ్రీ కృష్ణ జన్మాష్టమి, పార్సీ కొత్త ఏడాది… ఇలా పలు సందర్భాల్లో బ్యాంకులు తెరుచుకోవు. ఈ నెలలో మీరు బ్యాంకుల నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకోవాలనుకున్నా, ఇతర కార్యకలాపాల కోసం బ్యాంకులకు వెళ్లాలనుకున్నా సెలవు కలిగిన రోజులను గుర్తుంచుకోండి.

బ్యాంకులకు సెలవులు..

బ్యాంకులకు సెలవు దినాలు రాష్ట్రానికి రాష్ట్రానికి కాస్తా మారే అవకాశాలు ఉన్నాయి. బ్యాంకులకు సెలవు దినాల్లో ఏటీఎంల ద్వారా లిమిటెడ్ క్యాష్ మాత్రమే తీసుకోగలరు. ఏటీఎం విషయంలోను కొన్ని ఇబ్బందికర పరిణామలు ఉంటాయి. అందరూ అక్కడకు క్యూ కట్డడం వల్ల షార్టేజ్ అవుతుంది. కాబట్టి బ్యాంకు సెలవులను బట్టి ప్లాన్ చేసుకోండి.

 శని, ఆదివారాలతో కలిపి 11 రోజులు బ్యాంకులు క్లోజ్

శని, ఆదివారాలతో కలిపి 11 రోజులు బ్యాంకులు క్లోజ్

ఆగస్ట్‌లో 31 రోజులు ఉండగా, శని, ఆదివారాలతో కలిపి బ్యాంకులు మొత్తం 11 రోజులు క్లోజ్ అవుతాయి. మిగిలిన 20 రోజులు మాత్రమే వర్కింగ్ డేస్. ఆగస్ట్ 4, 11, 18, 25 ఆదివారాలు. ఆగస్ట్ 10, ఆగస్ట్ 24 రెండు.. నాలుగో శనివారం. ఈ రెండు రోజులు కూడా బ్యాంకులు క్లోజ్.

 ఈ వారంలో రెండు రోజులే తెరిచి ఉంటాయి

ఈ వారంలో రెండు రోజులే తెరిచి ఉంటాయి

ఆగస్ట్ 12వ తేదీన బక్రీద్ పండుగ సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవులు. అంతకుముందు 11వ తేదీ ఆదివారం. కాబట్టి వరుసగా రెండు రోజులు సెలవు. మణిపూర్, జమ్ము అండ్ కాశ్మీర్ వంటి చోట్ల బ్యాంకులకు ఆగస్ట్ 13న సెలవు. కాబట్టి ఇక్కడ వరుసగా మూడ్రోజులు సెలవు దినాలు. ఆ తర్వాత ఆగస్ట్ 15న బ్యాంకులకు సెలవు. ఈ ఆరు రోజుల్లో కేవలం 2 రోజులు మాత్రమే బ్యాంకులు పని చేస్తాయి.

శ్రీకృష్ణాష్టమి...

శ్రీకృష్ణాష్టమి…

ఆగస్ట్ 17వ తేదీన అహ్మదాబాద్, బెలాపూర్, ముంబై, నాగపూర్ వంటి చోట్ల పార్సీ న్యూ ఇయర్ సందర్భంగా బ్యాంకులకు సెలవు దినం. ఆగస్ట్ 23న శ్రీకృష్ణాష్టమి పర్వదినం సందర్భంగా బ్యాంకులు మూతబడతాయి. భువనేశ్వర్, చెన్నై, డెహ్రాడూన్, హైదరాబాద్, కాన్పూర్,లక్నో, పాట్నాలలో బ్యాంకులకు సెలవు దినాలు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here