బ్యాంకు అకౌంట్ క్లోజ్ చేయాలా: ఎలా చేయాలి, ఎంత ఛార్జ్?

0
0


బ్యాంకు అకౌంట్ క్లోజ్ చేయాలా: ఎలా చేయాలి, ఎంత ఛార్జ్?

మంత్లీ యావరేజ్ బ్యాలెన్స్ (MAB) ఛార్జీల విషయంలో బ్యాంకులు చాలా కఠినంగా ఉంటాయి. కేవలం ఈ విషయంలోనే కాదు, మీరు బ్యాంక్ అకౌంట్ క్లోజ్ చేయాలన్నా వసూలు చేసే పరిస్థితులు ఉంటాయని తెలుసా? ఉదాహరణకు మీరు ఖాతా తెరిచిన ఒక సంవత్సరం లోపు ఖాతాను మూసివేస్తే.. అడిషనల్ అకౌంట్ క్లోజర్ ఛార్జీలు ఉంటాయి. అకౌంట్ హోల్డర్ ఒక నిర్దిష్ట వ్యవధిలో బ్యాంకు ఖాతాను మూసివేస్తే బ్యాంకులు ముగింపు ఛార్జీలను వసూలు చేస్తాయి.

14 రోజుల్లోపు క్లోజ్ చేస్తే ఛార్జీలు ఉండవు

సాధారణంగా ఖాతాను తెరిచిన 14 రోజుల్లో క్లోజ్ చేస్తే బ్యాంకులు అదనపు ఛార్జీలను వసూలు చేయవు. అయితే 14 రోజుల తర్వాత.. ఏడాదికి ముందు అకౌంట్ క్లోజ్ చేస్తే మాత్రం ఛార్జీలు వసూలు చేస్తారు. అకౌంట్ ఓపెన్ చేసి ఏడాది దాటిన తర్వాత క్లోజ్ చేస్తే మాత్రం ఛార్జీలు వర్తించవు.

14 రోజుల నుంచి ఏడాది లోపు క్లోజ్ చేస్తే మాత్రం ఛార్జీ

14 రోజుల నుంచి ఏడాది లోపు క్లోజ్ చేస్తే మాత్రం ఛార్జీ

ఉదాహరణకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) అకౌంట్ హోల్డర్స్ ఏడాది దాటిన తర్వాత అకౌంట్ క్లోజ్ చేస్తే ఎలాంటి ఛార్జీలు ఉండవు. ఇదివరకు ఏడాది దాటిన తర్వాత అకౌంట్ క్లోజ్ చేస్తే రూ.500 ప్లస్ జీఎస్టీ వసూలు చేసేది. కానీ ఇప్పుడు ఏడాది దాటిన వారికి ఛార్జీలు లేవు. కానీ ఏడాదిలోపు క్లోజ్ చేస్తే మాత్రం ఛార్జీలు వసూలు చేస్తారు.

మరణించిన వ్యక్తి అకౌంట్ క్లోజింగ్‌కు నో ఛార్జెస్

మరణించిన వ్యక్తి అకౌంట్ క్లోజింగ్‌కు నో ఛార్జెస్

అలాగే, మరణించిన వ్యక్తి బ్యాంక్ ఖాతా క్లోజ్ అయితే మాత్రం ఛార్జీలు వసూలు చేయదు. అంతకుముందు, ఇలాంటి వాటికి కూడా రూ.500 ప్లస్ జీఎస్టీ ఛార్జ్ వసూలు చేసేది. మీరు బ్యాంకు అకౌంట్ తెరిచిన తర్వాత.. 14 రోజుల్లోపు క్లోజ్ చేస్తే ఎలాంటి ఛార్జీలు వర్తించవని గుర్తుంచుకోండి. 14 రోజుల తర్వాత క్లోజ్ చేస్తే మాత్రం దాదాపు అన్ని బ్యాంకులు కూడా రూ.500 నుంచి రూ.1000 వరకు వసూలు చేస్తున్నాయి.

అందుకే ఛార్జ్ చేస్తాయి...

అందుకే ఛార్జ్ చేస్తాయి…

బ్యాంకులు ఎకౌంట్ క్లోజింగ్ ఛార్జీలు వసూలు చేయడానికి కారణాలు ఉన్నాయని చెబుతున్నారు. బ్యాంకు అకౌంట్ ఓపెన్ చేసే సమయంలో ఓపెన్ కిట్, చెక్‌బుక్కు, డెబిట్ కార్డు వంటివి ఇస్తుంది. వీటి ఖర్చులు తిరిగి పొందేందుకు ఛార్జీలు వసూలు చేస్తాయని చెబుతున్నారు.

క్లోజింగ్ నిబంధనలు...

క్లోజింగ్ నిబంధనలు…

బ్యాంకు అకౌంట్ క్లోజింగ్ ఛార్జీలకు సంబంధించి ఆర్బీఐ వద్ద నిర్దిష్టమైన నిబంధనలు ఏమీ లేవు. ఇది బ్యాంకు యొక్క అభీష్టానుసారం ఉంటుంది. అయితే ఛార్జీలు వసూలు చేసేటప్పుడు మాత్రం తక్కువ పరిమాణంలో ఉన్న ఖాతాదారులకు జరిమానా విధించకుండా చూసుకోవాలని మాత్రం ఆర్బీఐ సూచనలు ఉన్నాయి.

క్లోజ్ ఎలా చేయాలి..

క్లోజ్ ఎలా చేయాలి..

బ్యాంకు అకౌంట్ క్లోజ్ చేయడానికి ముందుగానే మీరు మీ అకౌంట్‌లోని డబ్బులు విత్ డ్రా చేసుకోండి.

– మీ లోన్లకు, ఇతర ఇన్వెస్ట్‌మెంట్స్‌ అకౌంట్స్‌కు సంబంధించి ఏమైనా లింక్ చేసి ఉంటే డీ-లింక్ చేయండి.

– బ్యాంకుకు వెళ్లి అకౌంట్ క్లోజర్ ఫాంను ఫిల్ చేసి ఇవ్వాలి.

– ఇందులో మరో బ్యాంకు అకౌంట్‌కు సంబంధించిన వివరాలు అందించాలి. క్లోజ్ చేయడానికి ముందు అందులోని డబ్బును మరో అకౌంట్‌కు ట్రాన్సుఫర్ చేస్తారు.

– డోర్‌మాంట్ అకౌంట్ అయితే మొదట దానిని యాక్టివేట్ చేయాలి. ఆ తర్వాత క్లోజర్ ఫాం ఇవ్వాలి.

– డెబిట్ కార్డు, ఉపయోగించని చెక్కులు వంటివి తిరిగి ఇచ్చివేయాలి.

– అకౌంట్ క్లోజింగ్‌కు సంబంధించి సంతకం చేసిన లెటర్ లేదా అప్లికేషన్ ఇవ్వాలి.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here