బ్యాంకు చోరీకి విఫలయత్నం

0
3


బ్యాంకు చోరీకి విఫలయత్నం

కిటికీ ఇనుప చువ్వలు తొలగించిన దుండగులు

డిచ్‌పల్లి, న్యూస్‌టుడే: డిచ్‌పల్లి మండలంలోని ప్రధాన రహదారి పక్కన ఉన్న ఎస్‌బీఐ బ్యాంకులో దొంగలు చోరీకి విఫలయత్నం చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం తెల్లవారుజామున ఇద్దరు దుండగులు గ్యాస్‌ కట్టర్‌తో కిటికీ ఇనుప చువ్వలు తొలగించి లోపలికి వచ్చారు. కట్టర్‌తో లాకర్‌ తెరిచే ప్రయత్నం చేయగా స్మోక్‌ అలారం మోగడంతో దొంగలు పరారయ్యారు. బ్యాంకు లోపల అలారం శబ్దం వస్తుందని గమనించిన పెట్రోలింగ్‌ పోలీసులు సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై నవీన్‌కుమార్‌తో పాటు మేనేజర్‌కు సమాచారం ఇచ్చారు. ధ్వంసం చేసిన లాకర్‌ను పరిశీలించిన అధికారులు నగదు అపహరణకు గురికాకపోడంతో ఊపిరి పీల్చుకున్నారు. సీసీ ఫుటేజీ పరిశీలించిన పోలీసులు దుండగులు ముఖాలకు గుడ్డలు, చేతులకు గ్లౌజులు వేసుకున్నట్టు గుర్తించారు. క్లూస్‌ టీం బృందం వేలిముద్రలు సేకరించారు. మేనేజర్‌ ప్రవీణ్‌కుమార్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.

ధ్వంసమైన లాకర్‌

ప్రధానాంశాలు



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here