బ్యాడ్ న్యూస్: మారుతిలో 1,000 ఉద్యోగాల కోత

0
8


బ్యాడ్ న్యూస్: మారుతిలో 1,000 ఉద్యోగాల కోత

భారత్ ను ఆర్థిక మందగమనం వెంటాడుతోంది. ఈ ప్రభావం ఆటోమొబైల్ కంపెనీలపై స్పష్టంగా కనిపిస్తోంది. దేశీయ కార్ల దిగ్గజం మారుతి సుజుకి కూడా దీనికి అతీతం కాలేకపోతోంది. అమ్మకాలు క్షీణించి ఉద్యోగులను తొలగిస్తోంది. దేశంలో ప్రతి రెండు కార్లలో ఒకటి మారుతి సుజుకి కంపెనీ తయారు చేసిందే ఉంటుంది. సగటున భారత్ లో సంవత్సరానికి 10 లక్షలకు పైగా కార్లను విక్రయిస్తూ దశాబ్దాలుగా తనకు తిరుగులేదు అని నిరూపించుకోంది.

దిగువ మధ్య తరగతి, మధ్య తరగతి ప్రజలకు అందుబాటు ధరల్లో అద్భుతమైన కార్లను అందిస్తూ మకుటం లేని మహారాజుగా కొనసాగిన మారుతికి ఏడాదిగా అమ్మకాలు తగ్గి పోతున్నాయి. ఇది ఒక్క మారుతి సుజుకి కంపెనీకి పరిమితం కాలేదు కానీ… మిగితా కంపెనీలు ఈగలు తోలుకొన్న సమయం లోనూ రెండంకెల వృద్ధిని నమోదు చేస్తూ దూసుకు పోయే ఈ కంపెనీకి తొలిసారి ఒకింత ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది. దీంతో ఇప్పటికే 1,000 కి పైగా ఉద్యోగులను తొలగించింది. ఈ విషయాన్నీ రాయిటర్స్ వార్త సంస్థ వెల్లడించింది.

మరింత మందికి ఉద్వాసన?

ప్రస్తుతం అధికారికంగా మారుతి సుజుకి 18,845 మంది తాత్కాలిక ఉద్యోగుల్లో 1,181 మందికి ఉద్వాసన పలికింది. అంటే సుమారు 6% మంది ఉద్యోగులను తొలగించింది. కానీ పర్మనెంట్ ఉద్యోగులను ఇప్పటికైతే తొలగించలేదు. ప్రస్తుతం మారుతి సుజుకి కంపెనీ లో 15,892 మంది పర్మనెంట్ ఉద్యోగులు ఉన్నారు. కాగా నెలనెలకూ అమ్మకాలు తగ్గుతుండటం తో ఇప్పటికే 10% నికి పైగా ఉత్పత్తి నిలిపివేసింది. జులై నెల లోనూ అమ్మకాలు మరింత నిరాశాజనకంగా ఉన్నాయ్. ఏకంగా 33% అమ్మకాలు తగ్గిపోయి ఆందోళన నెలకొంది. దీంతో ముందు ముందు మరింత మంది తాత్కాలిక, పర్మనెంట్ ఉద్యోగులకు ఉద్వాసన పలికే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ప్రభుత్వ విధానాలే శాపమా?

ప్రస్తుత ఆటోమొబైల్ రంగ సంక్షోభానికి ప్రభుత్వం అవలంభిస్తున్న విధానాలే కారణమని నిపుణులు పేర్కొంటున్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగిపోవటం, డీజిల్ కార్ల అమ్మకాలను నిరుత్సహపరిచేలా విధానాలు అమలు అవుతున్నాయి. పెట్రోలు, డీజిల్ ధరల మధ్య వ్యత్యాసం తగ్గి పోవటం తో వినియోగదారులు కేవలం పెట్రోల్ కార్ల వైపే చూస్తున్నారు. దీంతో డీజిల్ కార్ల అమ్మకాలు క్షీణిస్తున్నాయి. ఇన్వెంటరీ పెరిగిపోవడంతో ఏం చేయాలో పాలుపోని పరిస్థితిలో అటు ఆటోమొబైల్ కంపెనీలు, ఇటు డీలర్లు తలలు పెట్టుకొంటున్నారు. పైగా ఇప్పుడు ప్రభుత్వం అత్యవసరంగా ఎలక్ట్రిక్ కార్లు, వాహనాలను ప్రోత్సహించాలని హడావిడిగా చర్యలు తీసుకొంటోంది. వాటిని ప్రోత్సహించేందుకు ఈ కార్ల అమ్మకాలను దెబ్బతీసేలా చర్యలు ఉంటున్నాయి. ఇన్సూరెన్సు ధరలు భారీగా పెరిగిపోయాయి. తాజాగా రిజిస్ట్రేషన్ ధరలు కూడా 10 రేట్ల నుంచి 20 రేట్లు పెంచుతోంది. బీఎస్-6 ప్రమాణాలను పాటించాల్సిందే అంటూ ఆదేశాలు జారీ చేయడంతో కార్ల కంపెనీలు సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. దీంతో దాదాపు అన్ని కార్లు, ద్విచక్ర వాహన, వాణిజ్య వాహనాల తయారీ కంపెనీలు ఉత్పత్తిలో కోత పెడుతున్నాయి. దాని అర్థం నేరుగా ఉద్యోగుల కోతే.

రుణాలను తగ్గించు కోనున్న బ్యాంకులు..

అంతకంతకూ అమ్మకాలు తగ్గిపోతుండటం తో ఆటోమొబైల్ రంగానికి రుణాలు ఇచ్చే విషయంలో స్పీడ్ తగ్గించాలని అన్ని బ్యాంకులు నిర్ణయించాయి. అటు కంపెనీలకు, ఇటు డీలర్లకు రుణాలు ఆచితూచి ఇవ్వాలని … లేదంటే నిరర్థక ఆస్తులు పెరిగిపోయే అవకాశం ఉందని బ్యాంకుల అభిప్రాయం. ఇవన్నీ కలిసి ఆటో రంగంపై మరింత ఒత్తిడి పెంచుతున్నాయి.

ఒకేసారి కుదరదు…

ఉన్నఫళంగా భారత రోడ్లపైకి ఎలక్ట్రిక్ కార్లు, వాహనాలను తీసుకు రావటం కుదరదని మారుతి సుజుకి సహా అన్ని కంపెనీలు ప్రభుత్వానికి సూచిస్తున్నాయి. ఎలక్ట్రిక్ వాహనాలకు అవసరమైన మౌలిక సదుపాయాలు లేవని… తొందరపాటు వాళ్ళ మేలు కంటే కీడు ఎక్కవ కలిగే అవకాశం ఉందని ఆటో పరిశ్రమ వర్గాలు మోర పెట్టుకొన్నా.. ప్రభుత్వం మాత్రం పట్టించుకోవటం లేదు. దీంతో, మారుతి బాటలోనే మరిన్ని కంపెనీలు ఉద్యోగులకు ఉద్వాసన పలికే అవకాశం ఉందని విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here