భక్తిధాం తాండాలో హరితహారం

0
0



నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కల్హేర్‌ మండలం భక్తిధాం తండా (బాల్కం చెల్క) గ్రామ పంచాయతీలో హరితహారం కార్యక్రమంలో భాగంగా శాసనసభ్యులు మహారెడ్డి భూపాల్‌ రెడ్డి మొక్కలు నాటి నీరుపోశారు. ఈ సందర్భంగా తాండా వాసులు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. అనంతరం భవాని మాత మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మొక్కల పెంపకం అవశ్యకతను వివరించారు. కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్‌ రమావత్‌ రామ్‌ సింగ్‌, మండల జెడ్‌పిటిసి నరసింహా రెడ్డి, ఎంపీపీ గుర్రపు సుశీల – అంజయ్య, మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షులు దుర్గా రెడ్డి, మనూర్‌ మండల మాజీ ఎంపీపీ లక్ష్మీ – గణపతి, కల్హేర్‌ మండలం మాజీ వైస్‌ ఎంపీపీ అంజి రెడ్డి, గ్రామ సర్పచ్‌ మూడ్‌ లలిత – కిషన్‌, సంగా రెడ్డి, అభిషేక్‌, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here