భక్తి శ్రద్దలతో బక్రీద్‌

0
0నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : త్యాగనిరతిని చాటే బక్రీద్‌ ఈద్‌ (ఈద్‌-ఉల్‌-జుహా) పండుగను జిల్లావ్యాప్తంగా ముస్లింలు ఘనంగా జరుపుకొన్నారు. బక్రీద్‌ సందర్భంగా సోమవారం ఉదయం ముస్లింలు ఈద్గాల వద్ద ప్రార్థనలు చేశారు. ఇబ్రహీం అలైసలాం తన కుమారుడు అయిన ఇస్మాయిల్‌ను దైవమార్గంలో బలి ఇచ్చేందుకు ఉపక్రమించటం ఆయన త్యాగానికి మెచ్చిన అల్లాహ్‌ ఇస్మాయిల్‌ బదులుగా మేకను పోలిన జీవాన్నీ ఉంచడం జరిగింది. ఇబ్రహీం అలైహి సలాం యొక్క త్యాగ పరీక్షను గుర్తుచేసుకోవడమే బక్రీద్‌ పండుగ ముఖ్య ఉద్దేశం. బక్రీద్‌ పండుగ అనంతరం ఒకరినొకరు అలై బలయి చేసుకొని ఈద్‌ ముబారక్‌ శుభాకాంక్షలు తెలుపుకొన్నారు. ఇంటికి వెళ్లి మేకలు, గోర్లు వగైర జీవాలను ఖుర్బానీ చేసి అట్టి మాంసాన్ని మూడు భాగాలు చేసి ఒక భాగం పేదలకు, మరో భాగం బంధువులకు పంచి, మిగిలిన ఒక భాగాన్ని ఇంటి వారితో కలిసి విందులు చేసుకొన్నారు. అధికారులు పలువురు రాజకీయ పార్టీ నాయకులు ముస్లింలకు బక్రీద్‌ శుభాకాంక్షలు తెలిపారు. నందిపేట్‌ మండలంలోని పలుగుట్ట వద్ద గల ఈద్గాలో, మసజీద్‌ మౌజా, ఖుదా న్పూర్‌, వన్నెల్‌, దొంకేశ్వర్‌, నుత్‌పల్లి, తొండాకుర్‌, అయిలపూర్‌, మల్లరం తదితర గ్రామాలలో ముస్లింలు భక్తి శ్రద్దలతో బక్రీద్‌ పండుగ జరుపుకొన్నారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here