భగత్‌సింగ్‌ స్ఫూర్తితో పోరాటాలకు సిద్దం కావాలి

0
1నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో అఖిల భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య, ఎంసిపిఐ పార్టీ ఆధ్వర్యంలో భగత్‌ సింగ్‌ 112 వ జయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. యువజన సమాఖ్య జిల్లా నాయకులు సూర్య వంశీ సురేష్‌, ఎంసిపిఐయు పార్టీ జిల్లా కార్యదర్శి రాజలింగం మాట్లాడుతూ భారత స్వాతంత్రం కోసం ఉరికొయ్యలను ముద్దాడేందుకు వెనకాడని భగత్‌ సింగ్‌, రాజుగారు, సుకుదేవ్‌ లలో శనివారం భగత్‌ సింగ్‌ జయంతి కావడం భారత దేశ ప్రజలకు స్పూర్తిదాయకమయిన రోజని అన్నారు. నేటి భారత పాలకులు దేశభక్తి ముసుగులో సాగిస్తున్న అరాచకాలు రాష్ట్ర ప్రభుత్వం సాగిస్తున్న ఫాసిస్టు పోకడలు అడ్డుకునేందుకు భగత్‌సింగ్‌ ఆశయ పోరాట స్ఫూర్తితో కామారెడ్డి జిల్లా లోని ప్రతి పౌరుడు పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నాయకులు బాలయ్య, లక్ష్మణ్‌, గణేష్‌, రాజు తదితరులు పాల్గొన్నారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here