భలే సిప్ లు… ఎన్ని రకాలున్నాయో తెలుసా?

0
1


భలే సిప్ లు… ఎన్ని రకాలున్నాయో తెలుసా?

ఒక్కసారిగా పెట్టుబడి పెట్టేందుకు సొమ్ము లేని వారు మ్యూచువల్ ఫండ్స్ లో క్రమానుగత పెట్టుబడి ప్లాన్ (సిప్)లను ఎంచుకుంటారు. వీటిలో నిర్ణీత మొత్తంతో పెట్టుబడి పెట్టవచ్చు. ఈ సొమ్ము పెట్టుబడి దారుని బ్యాంకు ఖాతా నుంచి ఆటో డెబిట్ అవుతుంది. ఆ మేరకు ఇన్వెస్టర్ కు యూనిట్ల కేటాయింపు జరుగుతుంది. వారం, నెల లేదా త్రైమాసికం వారీగా సిప్ లలో పెట్టుబడి పెట్టవచ్చు. సిప్ పెట్టుబడి ప్లాన్ల ద్వారా చాలా సులభంగా మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడికి అవకాశం ఉంటుంది. ఈ పెట్టుబడుల ద్వారా పొదుపు మొత్తాలు పెరగడమే కాకుండా పెట్టుబడుల విలువ కూడా పెరుగుతుంది. దీని వల్ల టార్గెట్ గా పెట్టుకున్న దాన్ని చేరుకునే అవకాశం ఉంటుంది.

ఎంతో ఈజీ

సిప్ పెట్టుబడులు ఎంతో సౌకర్యవంతమైనవి. వీటిలో పెట్టుబడిని పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. అవసరమైనప్పుడు పెట్టుబడులను నిలిపివేయవచ్చు కూడా. ఆర్థిక మార్కెట్ల గురించి పెద్దగా అవగాహనా లేని వారు సిప్ ల ద్వారా పెట్టుబడి పెట్టడం చాలా సులభం.

ఇవీ రకాలు..

ఇవీ రకాలు..

సిప్ లలో నాలుగు రకాలున్నాయి. వీటిలో ఏది సౌకర్యవంతంగా ఉంటే దాన్ని ఎంచుకోవచ్చు.

టాప్ అప్ సిప్

* కాలానుగుణంగా ఈ సిప్ లో పెట్టుబడి మొత్తాన్ని ఎంచుకోవచ్చు. ఇందులో మీ ఆదాయం పెరిగిన కొద్దీ మీ పెట్టుబడి మొత్తాన్ని పెంచుకోవచ్చు. ఇందులో మొదటి వాయిదా మొత్తం స్థిరంగా ఉంటుంది. పెంచుకునే మొత్తాన్ని ముందుగానే నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. దీని ప్రకారం కాలానుగుణంగా పెట్టుబడి మొత్తం పెరుగుతుంది.

ఫ్లెక్సిబుల్ సిప్

ఫ్లెక్సిబుల్ సిప్

* ఈ సిప్ లో మీరు మీ వద్ద ఉండే సొమ్మును బట్టి పెట్టుబడి మొత్తాన్ని పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. మీదగ్గర సొమ్ము లేని సందర్భంలో ఒకటి లేదా రెండు చెల్లింపులు చేయకున్నా ఏమీ కాదు. మీరు పెద్ద మొత్తంలో ఒకేసారి సొమ్మును పొందిన సందర్భంలో ఆ మొత్తాన్ని ఈ సిప్ లో పెట్టుబడిగా పెట్టడానికి అవకాశం ఉంటుంది.

* దీని ప్రకారం మొదటి వాయిదాను ఇన్వెస్టర్ ఫిక్స్ చేసుకుంటాడు. నిర్దేశిత ఫార్ములా ప్రకారం మార్కెట్ స్థాయిలో స్థాయిలో ఉంటే ఎక్కువ, ఎగువ స్థాయిలో ఉంటె తక్కువ పెట్టుబడికి అవకాశం ఉంటుంది.

పర్ఫెక్చువల్ సిప్

పర్ఫెక్చువల్ సిప్

సాధారణంగా సిప్ పెట్టుబడుల కాలపరిమితి ఏడాది, మూడేళ్లు, ఐదేళ్ళు ఉంటుంది. అయితే సిప్ ముగింపు తేదీని ఎంచుకోకపోతే అది పర్ పెక్చువల్ సిప్ అవుతుంది. ఈ ఫండ్స్ లో మీకు సొమ్ము అవసరం అయినప్పుడు ఉపసంహరించుకోవచ్చు. అయితే ఎప్పుడైనా సిప్ ముగింపు తేదీని ఎంచుకోవడం మంచిది.

ట్రిగ్గర్ సిప్..

ట్రిగ్గర్ సిప్..

* ఫైనాన్షియల్ మార్కెట్లపై తక్కువ పరిజ్ఞానం ఉన్నవారు ఈ సిప్ ను ఎంచుకోవచ్చు.

* ఇందులో ఇన్వెస్టర్లు ఎన్ ఏ వీ , ఇండెక్స్ లెవల్, సిప్ ప్రారంభ తేదీని సెట్ చేసుకోవచ్చు. ఈ సిప్ స్పెక్యులేషన్ ను ప్రోత్సహిస్తుంది.

వీటిలో ఇన్వెస్టర్లు తమకు నచ్చిన దాన్ని ఎంచుకొని దీర్ఘకాలంలో పెట్టుబడులను వృద్ధి పరచుకునే అవకాశం ఉంటుంది.

మల్టి సిప్

మల్టి సిప్

* దీని ద్వారా ఒకే ఫండ్ సంస్థ ఆఫర్ చేస్తున్న వివిధ స్కీమ్స్ లో పెట్టుబడి పెట్టవచ్చు.

* విభిన్న పోర్ట్ ఫోలియోను నిర్మించుకునే అవకాశం ఉంటుంది.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here