భళా యూపీఐ… లావాదేవీలు అదుర్స్!

0
1


భళా యూపీఐ… లావాదేవీలు అదుర్స్!

యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్పేస్ (యూపీఐ) ఆధారిత లావాదేవీలు జోరుగా పెరుతున్నాయి. డిజిటల్ లావాదేవీలు ఇందుకు ఊతం ఇస్తున్నాయి. ఫలితంగా యూపీఐ లావాదేవీలు రికార్డు స్థాయికి చేరుకుంటున్నాయి. సెప్టెంబరు నెలలో యూపీఐ ఆధారిత లావాదేవీలు 95.50 కోట్లకు పెరిగాయి. ఇదో సరికొత్త గరిష్ట స్థాయి. గత ఆగస్టులో లావాదేవీలు 91.83 కోట్లుగా నమోదయ్యాయని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్ పీసీఐ ) గణాంకాల ద్వారా వెల్లడైంది. కాగా గత సెప్టెంబర్ తో పోల్చితే లావాదేవీల్లో 135 శాతం లేదా 2.3 రేట్ల వృద్ధి నమోదయింది. ఆగస్టు లావాదేవీల విలువ రూ.1.54 లక్షల కోట్లు కాగా సెప్టెంబర్లో రూ.1.61 లక్షల కోట్లకు పెరిగాయి.

ఎన్ని బ్యాంకులు వాడుతున్నాయంటే..

* ప్రస్తుతం మనదేశంలోని ప్రభుత్వ, ప్రయివేట్ రంగంలోని 141 బ్యాంకులు యూపీఐ ఆధారిత యాప్ లను అందుబాటులోకి తెచ్చాయి. యూపీఐ ప్రారంభంలో 21 బ్యాంకులు దీని వినియోగించాయి.

* యూపీఐ ఆధారితంగా నిర్వహించే లావాదేవీల్లో సౌలభ్యం, భద్రత ఉండటం వల్ల ఎక్కువ వినియోగం జరుగుతోంది.

* ఈ పేమెంట్ వ్యవస్థను భారత రిజర్వ్ బ్యాంకు.. ఎన్ పీ సి ఐ ద్వారా అభివృద్ధి చేయించింది.

* 2018-19 సంవత్సరంలో డెబిట్ కార్డు ద్వారా జరిగిన లావాదేవీలకన్నా యూపీఐ లావాదేవీలు 1.2 రేట్లు ఎక్కువ జరిగాయని భారత రిజర్వ్ బ్యాంకు గణాంకాలు చెబుతున్నాయి.

* 2016 నవంబరులో రూ.500, రూ.1,000 నోట్లను ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత యూపీఐ పేమెంట్ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చారు.

* యూపీఐ ని చాలా ప్రీ పెయిడ్ ఇన్స్ట్రుమెంట్స్ లేదా వాలెట్ కంపెనీలు అయిన పేటీఎం, మోబిక్విక్ వంటివి వినియోగిస్తున్నాయి.

బీమ్ లావాదేవీలు ఇలా..

బీమ్ లావాదేవీలు ఇలా..

* యూపీఐ ఆధారితంగా ప్రభుత్వం భారత్ ఇంటర్ఫేస్ ఫర్ మనీ (బీమ్)లావాదేవీల్లో వృద్ధి సెప్టెంబర్ నెలలో 1.7 శాతం వృద్ధి చెందాయి. ఈ నెలలో నమోదైన లావాదేవీల సంఖ్య 1.71 కోట్లు ఉండగా వీటి విలువ రూ. 5,924 కోట్లుగా నమోదయింది.

* ఆగస్టులో లావాదేవీలు 1.68 కోట్లుగా నమోదు కాగా వీటి విలువ రూ. 6,132 కోట్లుగా నమోదయ్యాయి.

* సెప్టెంబర్ లో ఇమీడియేట్ పేమెంట్ సర్వీస్ (ఐ ఎం పీ ఎస్) లావాదేవీల్లో అంతంత మాత్రమే వృద్ధి నమోదయింది. ఈ నెలలో ఐ ఎం పీ ఎస్ లావాదేవీలు 20.41 కోట్లు జరగ్గా వీటి విలువ రూ.1.83 కోట్లుగా ఉంది. లావాదేవీల సంఖ్య తక్కువ తక్కువ ఉన్నప్పటికి వాటి విలువ మాత్రం ఎక్కువగా ఉంది.

* గత ఆగస్టులో ఐ ఎం పీ ఎస్ లావాదేవీలు 20 కోట్లు ఉండగా వాటి విలువ రూ.1.88 లక్షల కోట్లుగా నమోదయింది.

త్వరలో 100 కోట్లు

త్వరలో 100 కోట్లు

* యూపీఐ లావాదేవీల్లో జోరు ఇలాగే కొనసాగితే వచ్చే నెలలోనే లావాదేవీల సంఖ్య 100 కోట్లు దాటే అవకాశం ఉందని పరిశీలకులు చెబుతున్నారు.

* ప్రస్తుత పండగల సీజన్ ఇందుకు దోహద పడుతుందని భావిస్తున్నారు.

* సెమీ అర్బన్, గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ లావాదేవీలు బాగా పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here