భారం భారీగా

0
0


భారం భారీగా

  నినదించిన ఆర్టీసీ కార్మికులు

మద్దతు తెలిపిన కాంగ్రెస్‌, వామపక్షాలు

దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు ఇక్కట్లు

బస్సులున్నవి.. ప్రయాణికులే లేరు

ఆర్టీసీ కార్మికులు మూడో రోజూ సమ్మెలోనే ఉన్నారు. నిరసనలు హోరెత్తాయి… రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు ‘మద్దతు’ పలికాయి. సమ్మెపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ఖండించాయి.

ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో పలు డిపోల పరిధిలో సోమవారం ప్రైవేటు బస్సులు నడిపించారు. ఖర్చుకు తగిన ఆదాయం రాక ఆర్టీసీ నష్టాన్ని చవిచూడాల్సి వస్తోంది. ఆదివారం ఇంధనం కోసం రూ. 9 లక్షలు ఖర్చు చేస్తే రూ. 7 లక్షల ఆదాయం మాత్రమే వచ్చింది.

ఈనాడు, నిజామాబాద్‌

నిజామాబాద్‌ రీజియన్‌ పరిధిలో ఆరు డిపోల పరిధిలో ఆర్టీసీ, ప్రైవేటు కలిపి 734 ఉన్నాయి. కామారెడ్డి జిల్లాలో 123, నిజామాబాద్‌ జిల్లాలో 125 బస్సులు తిరిగాయి. బస్సులు వేళలు తెలియక ప్రయాణికులు ప్రైవేటు వాహనాలనే ఆశ్రయించి జేబులకు చిల్లు పెట్టుకొన్నారు. నిజామాబాద్‌ డిపోలో బస్సులు పెద్ద సంఖ్య ఉన్నా.. ప్రయాణికులు లేరు. కార్మికులకు వివిధ పార్టీల నాయకుల నుంచి మద్దతు లభించింది.

సోమవారం సైతం కార్మికులు ఎవరూ విధుల్లోకి రాకపోవడంతో తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లను నియమించుకొని ప్రధాన మార్గాల్లో బస్సులు నడిపారు. బోధన్‌లో తాత్కాలిక డ్రైవర్‌, కండక్టర్‌ విధులు కేటాయించాలని అభ్యర్థులు ఆందోళనకు దిగారు. ప్రధాన మార్గాల్లో ప్రైవేటు సర్వీసులు నడిపేందుకు అనుమతిచ్చారు. ఇదే అదునుగా భావించి ముక్కుపిండి ఛార్జీలు వసూలు చేశారు. రెట్టింపు ఛార్జీలు వసూలు చేయడంతో ప్రయాణికులు నిరసన తెలిపారు. ప్రశ్నించిన ప్రయాణికులను మధ్యలోనే దించేయడంతో వారు ఎటూ వెళ్లలేని పరిస్థితి. రవాణా శాఖ అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో ప్రైవేటు నిర్వాహకులు ఇష్టారీతిన వ్యవహరించారు. అన్ని డిపోల పరిధిలో కార్మికులు ఆందోళన చేపట్టారు. కామారెడ్డిలో కార్మికుల దీక్షకు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత షబ్బీర్‌ అలీ మద్దతు తెలిపారు. ఆర్మూర్‌లో మాజీ ప్రభుత్వ విప్‌ ఈరవత్రి అనిల్‌ సంఘీభావం ప్రకటించారు. వామపక్ష పార్టీల నాయకులు ప్రభుత్వ తీరును నిరసిస్తూ ర్యాలీలు చేపట్టారు. పోలీసులు వారిని అడ్డుకొని అరెస్టు చేశారు. కామారెడ్డిలో రూ. 50 నుంచి రూ. 100 అదనంగా ఛార్జీలు వసూలు చేయడంతో కొందరు ప్రయాణికులు తిరగబడ్డారు. పర్యవేక్షణ కొరవడడంతో ప్రైవేటు ట్రావెల్స్‌ నిర్వాహకులు ప్రయాణికుల పట్ల దురుసుగా వ్యవహరించారు.

నిజామాబాద్‌ బస్టాండులో పరిస్థితి ఇదిSource link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here