భారత్,పాక్ రెండు దేశాల్లో బక్రిద్ ఉత్సవాలు.. కాని అక్కడ మాత్రం ఉత్సవాలు లేవు…

0
0


భారత్,పాక్ రెండు దేశాల్లో బక్రిద్ ఉత్సవాలు.. కాని అక్కడ మాత్రం ఉత్సవాలు లేవు…

పాకిస్థాన్‌కు శత్రుదేశమైన భారత్ పై కోపం నరనరాన జీర్ణించుకు పోయింది. కశ్మీర్ ఉదంతంతో రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను తగ్గించుకునేందుకు నిర్ణయించిన పాకిస్థాన్ ఇరు దేశాల మధ్య ఉన్న మానవ సంబంధాలను కూడ తెగతెంపులు చేసుకునేందుకు రవాణ వ్వవస్థకు ఫుల్ స్టాప్ పెట్టింది.. దీంతోపాటు ఇరు దేశాల మధ్య జరిగే బక్రిద్ పండగ సాంప్రదాయాలను సైతం జరుపుకునేందుకు నిరాకరించింది.

రెండు దేశాల మధ్య స్వీట్ల పంపిణి

పాకిస్థాన్ ,ఇండియా బార్డర్‌ ప్రాంతాలైన అటారీ, వాఘా సరిహద్దుల వద్ద ప్రతి సంవత్సరం బక్రిద్ రోజున రెండు దేశాల సైనికులు సీట్లు పంచుకుంటారు. బక్రిద్ కావడంతో నేడు పాకిస్థాన్ సైనికులు బీఎస్ఎఫ్ అధికారులకు అధికారులకు స్వీట్లు తెచ్చి ఇవ్వాల్సి ఉంటుంది. దీంతో తిరిగి భారత్ కూడ వారికి స్వీట్లు పంపిణి చేయడం సాంప్రదాయంగా కొనసాగుతోంది. బక్రిద్ తోపాటు రెండు దేశాల స్వాతంత్య్ర దినోత్సవాలు, దీపావళీ, దసరా తోపాటు రిపబ్లిక్ ఉత్సవాల సంధర్భంగా ఈ స్వీట్ల పంపిణి సాంప్రదాయం కొనసాగుతోంది.

పండగలకు కూడ శత్రుత్వాన్ని జోడించిన పాకిస్థాన్

పండగలకు కూడ శత్రుత్వాన్ని జోడించిన పాకిస్థాన్

కాని నేడు జరిగిన బక్రిద్ ఉత్సవాల్లో భాగంగా చేపట్టాల్సిన స్వీట్ల పంపిణికి పాకిస్థాన్ సైన్యం బ్రేకులు వేసింది. బక్రిద్ సంధర్భంగా ఇరు దేశాల మధ్య స్వీట్ల పంపిణి, బక్రిద్ ఉత్సవాలు అధికారికంగా కొనసాగించేందుకు పాకిస్థాన్ సైనికులు ముందుకు రాలేదు. దీంతో భారత దేశం సైతం వారికి స్వీట్లు ఇచ్చేందుకు వెనకడుగు వేసిందని బీఎస్ఎఫ్ అధికారులు తెలిపారు. బక్రిద్‌తో పాటు రానున్న రెండు దేశాల స్వాతంత్ర్య దినోత్సవాల ఉత్సవాల కూడ స్వీట్ల పంపీణి ఉండకపోవచ్చని సైనిక అధికారులు తెలిపారు.

దేశ వ్యాప్తంగా బక్రిద్ ఉత్సవాలు

దేశ వ్యాప్తంగా బక్రిద్ ఉత్సవాలు

బక్రిద్ సంధర్భంగా ఇటు భారతదేశంతోపాటు, పాకిస్థాన్ ప్రజలు కూడ పెద్ద ఎత్తున ఉత్సవాలు జరుపుకున్నారు. మరోవైపు ఉద్రిక్తతకు కారణమైన కశ్మీర్‌లో కూడ బక్రిద్ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. కాని రెండు దేశాల ప్రజలను కాపాడే సైనిక దళాల మధ్య పండగకు ఫుల్ పడింది. ఇక 2016లో పాకిస్థాన్ కాల్పుల విరమణ జరిగిన సంధర్భంతోపాటు భారత ప్రభుత్వం పాకిస్థాన్ సర్జికల్ స్ట్రైక్ చేసినప్పుడు కూడ స్వీట్ల పంపిణి చేసుకోలేదని భద్రతా దళాల అధికారులు తెలిపారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here