‘భారత్‌ను విశ్వవిజేతగా నిలిపాడు.. అతడే హెడ్ కోచ్‌గా మనకు కావాలి’

0
4


హైదరాబాద్: వరల్డ్ ఛాంపియన్స్ ఇంగ్లాండ్ జట్టుకు త్వరలో కొత్త కోచ్ రాబోతున్నాడు. ఇంగ్లాండ్ జట్టు తొలిసారి విశ్వవిజేతగా నిలువడంలో కీలకపాత్ర పోషించిన ఆ జట్టు హెడ్ కోచ్‌ ట్రెవర్‌ బేలిస్‌ ఇటీవలే సొంతగడ్డపై ముగిసిన ఐదు టెస్టుల యాషెస్ సిరీస్ అనంతరం తన పదవి నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్ క్రికెట్ డైరెక్టర్ ఆశ్లే గిల్స్ ఇప్పటికే నూతన కోచ్ ఎంపికపై కసరత్తు ప్రారంభించారు. ఇందులో భాగంగా మూడు ఫార్మాట్లలో ఇంగ్లాండ్ జట్టుకు దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ గ్యారీ కిర్‌స్టన్‌ను హెడ్ కోచ్‌గా నియమించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. కోచ్ రేసులో గ్యారీ కిర్‌స్టన్ ముందంజలో ఉన్నట్లు తెలుస్తోంది.

సారా కఠిన నిర్ణయం: మొన్న నగ్న చిత్రం, నేడు అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు

ఇటీవలే సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో ముగిసిన ఐదు టెస్టుల యాషెస్ టెస్టు సిరీస్‌ను ఇంగ్లాండ్ 2-2తో సమం చేసిన చేసిన సంగతి తెలిసిందే. ది టెలిగ్రాఫ్‌లో వచ్చిన కథనం ప్రకారం ఇంగ్లాండ్ జట్టుకు వన్డేల్లో మాత్రమే కోచ్‌గా పని చేసేందుకు గ్యారీ కిర్‌స్టన్ ఆసక్తికనబర్చినట్లు తెలిసింది. అయితే, బోర్డు మాత్రం అతడిని పూర్తి స్థాయి హెడ్ కోచ్‌గా నియమించుకోవాలని భావిస్తోంది.

కాగా, గ్యారీ కిరెస్టన్ కోచింగ్‌లోనే భారత క్రికెట్ జట్టు 2011 వన్డే వరల్డ్ కప్‌లో విజేతగా నిలిచింది. టీమిండియాకు మొత్తం నాలుగేళ్ల పాటు కోచ్‌గా వ్యవహారించిన సమయంలో జట్టుని అత్యుత్తమంగా కిరెస్టన్ తీర్చిదిద్దాడు. అంతేకాదు దక్షిణాఫ్రికా జట్టు టెస్టుల్లో నంబర్‌వన్‌గా అవతరించడంలోనూ కిరెస్టన్‌దే కీలకపాత్ర.

వార్మప్ మ్యాచ్‌లో మర్క్రమ్ సెంచరీ: రెండో రోజు ముగిసిన ఆట, దక్షిణాఫ్రికా 199/4

ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)తో పాటు పలు అంతర్జాతీయ టీ20 జట్లకు ప్రస్తుతం కిరెస్టన్ కోచ్‌గా వ్యవహారిస్తున్నారు. 2013 నుంచి గ్యారీ కిరెస్టన్ కోచ్‌గా ఏదో ఒక జట్టుకు విధులు నిర్వహించారు. ముఖ్యంగా అతడికి అన్ని ఫార్మాట్లలోనూ మంచి కోచింగ్ నైపుణ్యం ఉంది. ఈ నేపథ్యంలో కిరెస్టన్ సేవలను వినియోగించుకోవాలని ఇంగ్లాండ్ బోర్డు ప్రయత్నిస్తోంది.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here