భారత్‌లోనే కాదు… గోల్డ్ జ్యువెల్లరీ అంతటా అదే పరిస్థితి: ఇన్వెస్టర్లకు షాక్!

0
0


భారత్‌లోనే కాదు… గోల్డ్ జ్యువెల్లరీ అంతటా అదే పరిస్థితి: ఇన్వెస్టర్లకు షాక్!

న్యూఢిల్లీ: గత నాలుగైదు నెలల్లోనే బంగారం ధరలు 20 శాతానికి పైగా పెరిగి రూ.40,000కు సమీపంలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో దీపావళి, ధన్‌తెరాస్ వంటి పండుగల సమయంలో గత ఏడాది కంటే సేల్స్ తగ్గిపోయాయి. అంతర్జాతీయ వాణిజ్య పరిస్థితులు కూడా బంగారం ధరలు పెరగడానికి కారణం. మన దేశంలో రూపాయి బలహీనపడటం కూడా ఓ కారణం. దీంతో ఈసారి సేల్స్ తగ్గాయి. ఐతే పసిడి, ఆభరణాల సేల్స్ భారత్‌లోనే కాదు ఆసియాలోనే తగ్గుముఖం పట్టాయి.

2010 జూన్ తర్వాత కనిష్టానికి జ్యువెల్లరీ డిమాండ్

ప్రపంచవ్యాప్తంగా జ్యువెల్లరీ డిమాండ్ సెప్టెంబర్ క్వార్టర్‌లో16 శాతం (ఇయర్ టు ఇయర్) తగ్గి 460.9 టన్నులకు పడిపోయినట్లు వరల్డ్ గోల్డ్ కౌన్సెల్ (WGC) రిపోర్ట్ తెలిపింది. 2010 జూన్ క్వార్టర్ నుంచి జ్యువెల్లరీ డిమాండ్ అత్యంత కనిష్టానికి పడిపోవడం ఇదే మొదటిసారి. ఔన్స్ బంగారం ధర అంతర్జాతీయ మార్కెట్లో 1500 డాలర్లకు అటూ ఇటూ తచ్చాడుతోంది.

భారత్‍‌లోను అదే పరిస్థితి...

భారత్‍‌లోను అదే పరిస్థితి…

ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ వాణిజ్య పరిస్థితుల ఒత్తిళ్ళు… కస్టమర్లు వారి కొనుగోలు ప్రణాళికలను మోడరేట్ చేయడానికి ప్రోత్సహించింది. చాలా మార్కెట్లు ఇయర్ టు ఇయర్ ప్రకారం క్షీణతను నమోదు చేశాయి. భారత్‌లోను అదే పరిస్థితి నెలకొని ఉంది. బంగారంపై కస్టమ్ డ్యూటీని 12.5 శాతం తగ్గించడం కూడా జ్యువెల్లరీ సేల్స్ తగ్గడానికి కారణమయ్యాయని WGC రిపోర్ట్ పేర్కొంది.

పండుగపై ఆశలు పెట్టుకున్నప్పటికీ..

పండుగపై ఆశలు పెట్టుకున్నప్పటికీ..

భారత్‌లో అటో సేల్స్, ఎఫ్ఎంసీజీ బలహీనంగా ఉన్న సమయంలో బంగారానికి డిమాండ్ పెరుగుతుందని ఆశించే పరిస్థితి లేదని పేర్కొంది. ఐతే జ్యువెల్లరీ వ్యాపారులు అక్టోబర్ నెలలో దీపావళి, ధన్‌తెరాస్ వంటి పండుగలు ఉండటంతో ఆశలు పెట్టుకున్నారని, భారీ ఆఫర్లు కూడా ప్రకటించారని కానీ అది ఆశించిన మేర ఫలితం చూపలేదని అంటున్నారు. గత ఏడాది కంటే సేల్స్ తగ్గినప్పటికీ చాలామంది అంచనాల కంటే మాత్రం పసిడి విక్రయాలు పెరిగాయి.

60 శాతం తగ్గుదల

60 శాతం తగ్గుదల

మరో నివేదిక ప్రకారం సెప్టెంబర్ క్వార్టర్లో బంగారం సేల్స్‌పై భారీగా ప్రభావం పడింది. ఇయర్ టు ఇయర్ లెక్కన 26 శాతం పడిపోయింది. ఈ కాలంలో భారత్‌లో అసాధారణంగా 60 శాతం మేర డిమాండ్ పడిపోవడం గమనార్హం. చైనాలో 13 శాతం, యూరోపియన్‌లో 12 శాతం తగ్గింది. ఆసియా దేశాలలో స్థానిక కరెన్సీ ప్రకారం బంగారం ధరలు అధికంగా ఉన్నాయి. దీంతో డిమాండు పెరగలేదని నివేదికలు చెబుతున్నాయి. ప్రస్తుతం చాలామంది అమెరికా – చైనా వాణిజ్య చర్చల వైపు చూస్తున్నారు.

చైనాలో తగ్గుదల

చైనాలో తగ్గుదల

ప్రపంచంలో అత్యధిక గోల్డ్ కన్స్యూమర్ చైనా. ఇండియాతో పాటు చైనా కూడా తక్కువ బంగారం దిగుమతులను తగ్గించుకుంది. ఆగస్ట్ నుంచి సెప్టెంబర్ కాలంలో దిగుమతులు 9 శాతం తగ్గించింది. చైనా గోల్డ్ అసోసియేషన్ ప్రకారం గత త్రైమాసికంతో పోలిస్తే ఈ త్రైమాసికంలో బంగారం వినియోగం 20.7 శాతం తగ్గి 244.8 టన్నులుగా ఉంది. ముఖ్యంగా బంగారానికి, ఆభరణాలకు అధిక డిమాండ్ కలిగిన చైనా, భారత్‌లలో కొనుగోళ్లు తగ్గిన ప్రభావం కనిపిస్తోంది.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here