'భారత్‌లో తయారీ'కి సర్కారు ఏం చేయాలనుకుంటుందో తెలుసా?

0
2


‘భారత్‌లో తయారీ’కి సర్కారు ఏం చేయాలనుకుంటుందో తెలుసా?

భారత్ లో తయారీ పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక రకాల చర్యలు తీసుకుంటున్నది. ఇందులో భాగంగా కంపెనీలకు ప్రోత్సాహకాలు అందిస్తున్నాయి. పన్ను ప్రయోజనాలు ఇస్తోంది. అయినప్పటికీ భారత్ లో తయారీ ఊపందుకోవడం లేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మరిన్ని చర్యలకు సిద్ధం అవుతోంది. ఇందులో భాగంగా మరిన్ని ఉత్పత్తుల దిగుమతులపై సుంకాలను విధించాలని భావిస్తోంది. వీటిలో ఎలక్ట్రానిక్స్, బొమ్మలు, బ్లాంకెట్లు, రోజువారీగా వినియోగించే ఉత్పత్తులు ఉన్నాయి. వీటిపై సుంకాలను విధించడం ద్వారా వాటి దిగుమతులు తగ్గే విధంగా చేయాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. ఇప్పటికే కొన్ని రకాల ఉత్పత్తులపై సుంకాలు పెంచింది ప్రభుత్వం.

జాబితా సిద్ధం

* ఏయే ఉత్పత్తులపై దిగుమతి సుంకాలు విధించాలన్న జాబితాను వాణిజ్యశాఖ విభాగం సిద్ధం చేసింది. అయితే ఈ జాబితాలోని ఉత్పత్తులపై తుది నిర్ణయం తీసుకునే ముందు ప్రభుత్వ ఏజెన్సీలతో సంప్రదించాలని వేచిచూస్తున్నారు.

* ఈ ఏజెన్సీలు ఓకే చెబితే ఆయా ఉత్పత్తులపై సుంకాలను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది.

* దాదాపు 100-150 కంపెనీలు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది.

దేశీ కంపెనీలకు ప్రయోజనం

దేశీ కంపెనీలకు ప్రయోజనం

* ప్రభుత్వం వివిధ ఉత్పత్తులపై సుంకాలను విధించడం వల్ల ఆయా ఉత్పత్తుల దిగుమతులు తగ్గుతాయి. ఫలితంగా దేశీయంగా ఉత్పత్తి పెరగడానికి దోహద పడుతుంది. దీనివల్ల దేశీయ కంపెనీల ప్రయోజనాలు కాపాడినట్టవుతుంది.

* మరో విషయం ఏమిటంటే మనదేశానికి ఉత్పత్తులు పంపుతున్న కంపెనీలు తమ యూనిట్లను భారత్ లో ఏర్పాటు చేసే అవకాశాలు ఉంటాయని ప్రభుత్వం భావిస్తోంది.

* దేశేయ కంపెనీలు ఉత్పత్తిని పెంచి, విదేశీ కంపెనీలు కూడా దేశంలో యూనిట్లను ఏర్పాటు చేస్తే పెద్ద ఎత్తున ఉత్పత్తి పెరగడమే కాకుండా లక్షలాదిగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ప్రభుత్వం యోచిస్తోంది.

* అంతే కాకుండా దేశం నుంచి ఎగుమతులను పెంచడానికి అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.

రిస్కులు ఉన్నాయి...

రిస్కులు ఉన్నాయి…

* విదేశాల నుంచి కొన్ని ఉత్పత్తులు దిగుమతి చేసుకోవడం వల్ల అవి తక్కువ ధరలకు లభిస్తున్నాయి. ఇప్పుడు అలాంటి ఉత్పత్తులపై సుంకాలు విధించడం వల్ల వాటి ధరలు పెరగడానికి అవకాశం ఉంటుంది.

* అధిక పన్నులకారణంగా ముడిసరుకుల దిగుమతులపై ఆధారపడిన కంపెనీలపై ప్రభావం పడే ఆస్కారం.

* భారత్ తో స్వేచ్చా వాణిజ్య ఒప్పందం కలిగిన దేశాలకు ఎక్కువ ప్రయోజనం కలిగే అవకాశం ఉందని అంటున్నారు.

* ఆసియాన్ దేశాలు, చైనా, జపాన్, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, న్యూజీలాండ్ లతో ప్రతిపాదిత స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం వల్ల 80-90 శాతం ఉత్పత్తులను తక్కువ పన్నుకు లేదా సున్నా పన్నుకు దిగుమతులను అనుమతించాల్సి ఉంటుంది.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here