భారత్‌లో పాక్ ఉగ్రవాదులు దాడులకు పాల్పడొచ్చు.. అమెరికా ఆందోళన!

0
1


జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక హోదా రద్దుచేసిన తర్వాత భారత్‌పై ఉగ్రవాదులు దాడులకు పాల్పడే అవకాశం ఉందని పలు దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయని అమెరికా పేర్కొంది. కశ్మీర్‌పై నిర్ణయం ఫలితంగా సరిహద్దుల్లో కార్యకలాపాలు నిర్వహించే ఉగ్రవాద మూకలకు పాకిస్థాన్ సహకరిస్తోందని ఆందోళన చెందుతున్నట్టు వెల్లడించింది. అయితే, ఈ రకమైన చర్యలకు చైనా మద్దతు ఇస్తుందని తాము భావించడం లేదని ఇండో-పసిఫక్ భద్రతా వ్యవహారాల శాఖ సహాయ మంత్రి రండాల్ ష్రివర్ వ్యాఖ్యానించారు. కశ్మీర్‌కు ప్రత్యేక హక్కులు కల్పించే ఆర్టికల్ 370, 35ఏను భారత్ రద్దుచేసిన తర్వాత పాకిస్థాన్ చేస్తున్న వాదనలకు చైనా మద్దతు ఇస్తుందా అన్న ప్రశ్నకు సమాధానం ఇచ్చిన ష్రివర్.. దౌత్య, రాజకీయపరంగా మద్దతు ఇస్తుందని భావిస్తున్నానని అన్నారు.

అంతర్జాతీయ వేదికలపై పాక్‌ను సమర్ధిస్తోందని, ఐక్యరాజ్యసమితిలోనూ కశ్మీర్ అంశాన్ని ప్రస్తావించింది.. కానీ, దీనికి మించి చైనా మద్దతు ఇస్తున్నట్టు కనిపించడంలేదని ఆయన వ్యాఖ్యానించారు. పాకిస్థాన్‌తో చైనాకు దీర్ఘకాలిక అనుబంధం ఉందని, భారత్‌తో వారికి పోటీ పెరుగుతోందని అన్నారు. అయితే, చైనాతో మాత్రం భారత్ సత్సబంధాలను కోరుకుంటోందని ష్రివర్ పేర్కొన్నారు. ‘చైనాతో సంబంధాలపై భారత్ విధానం గురించి తమకు ఓ అవగాహన ఉందని, ఈ విషయంలో విదేశాంగ మంత్రి జయశంకర్‌తో తాను మాట్లాడాను.. పొరుగు దేశంతో మెరుగైన సంబంధాలను ఆ దేశం ఆకాంక్షిస్తోంది.. ఇదే సమయంలో ఇండియా నుంచి డ్రాగన్ తీవ్ర పోటీ ఎదుర్కొంటొంది.. ఇందులో ఎలాంటి సందేహం లేదు.. కాబట్టి కశ్మీర్‌ సహా పలు అంశాలపై చైనా పాకిస్థాన్‌వైపు మొగ్గు చూపుతోందని నేను భావిస్తున్నాను’ అని రండాల్ ష్రివర్ స్పష్టం చేశారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here