భారత్‌లో లంబోర్గిని కారు రికార్డ్! రూ.3 కోట్ల కారు.. వారానికే విక్రయం

0
3


భారత్‌లో లంబోర్గిని కారు రికార్డ్! రూ.3 కోట్ల కారు.. వారానికే విక్రయం

ఇటీవలి వరకు ఆటో మందగమనం తెలిసిందే. జూలై, ఆగస్ట్ నెలల్లో కొన్ని సేల్స్ రెండు దశాబ్దాల కనిష్టానికి కూడా పడిపోయాయి. పెద్ద కంపెనీలు తాత్కాలికంగా యూనిట్లు క్లోజ్ చేశాయి. డీలర్లు షాప్స్ క్లోజ్ చేసుకున్నారు. ఉద్యోగులను తొలగించారు. దీంతో దేశవ్యాప్తంగా ఆందోళనకర పరిస్థితులు కనిపించాయి. ఆటో, బైక్స్, కారు, పాసింజర్ వెహికిల్స్… ఇలా అన్ని రకాల వాహనాల సేల్స్ దారుణంగా పడిపోయాయి.

కానీ అత్యంత ఖరీదైన లంబోర్గిని కారు సేల్స్ మాత్రం ఇందుకు భిన్నంగా ఉండటం గమనార్హం. రూ.3 కోట్ల వరకు విలువ కలిగిన ఈ ఇటాలియన్ స్పోర్ట్స్ కార్ మేకరు లంబోర్గని SUV గత ఏడాది కాలంగా బాగానే అమ్ముడుపోతున్నాయి. వాహన మందగమనం సమయంలోను ఇది ఎక్కువగా సేల్ కావడం గమనార్హం. దేశీయ మార్కెట్లో లంబోర్గిని విక్రయాలు 30 శాతం పెరిగాయి.

ఈ ఏడాది మార్కెట్లోకి వచ్చిన లంబోర్గిని ఉరుస్‌కు మంచి ఆదరణ ఉంది. దీని ధర దాదాపు రూ.3 కోట్లు. ఇప్పటికే ఈ కారు కోసం 50కి పైగా బుకింగ్స్ వచ్చినట్లు లంబోర్గిని ఇండియా హెడ్ శరద్ అగర్వాల్ తెలిపారు. అంటే సగటున వారానికి ఓ కారు చొప్పున సేల్ చేసినట్లు.

ఈ ఏడాదిలో 60 యూనిట్ల లంబోర్గిని కార్లను విక్రయించే అవకాశముందని కంపెనీ అంచనా. అదే జరిగితే భారత్‌లో ఏడాది కాలంలో 50 కంటే ఎక్కువ వాహనాలను విక్రయించిన తొలి సూపర్ లగ్జరీ కార్ల తయారీ సంస్థగా లంబోర్గని రికార్డ్ సృష్టించనుంది. గత ఏడాది ఈ సంస్థ భారత్‌లో 45 వాహనాలను విక్రయించింది. వచ్చే మూడేళ్లలో 100 వాహనాలను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకుంది. 2022 నాటికి అన్ని కార్ల సేల్స్ ఉంటాయని భావిస్తున్నారు.

టాప్ మెట్రో నగరాలతో పాటు టైర్ 2, టైర్ 3 నగరాల్లో కూడా డిమాండ్ పెరుగుతున్నట్లుగా చెబుతున్నారు. లుధియానా, కాన్పూర్, భువనేశ్వర్, ఇండోర్, సూరత్, హుబ్లీ వంటి నగరాల నుంచి కూడా డిమాండ్ ఉందని చెబుతున్నారు. ఈ కంపెనీ బెంగళూరు, ఢిల్లీ, ముంబైలలో… మూడు షోరూమ్స్ నిర్వహిస్తోంది.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here