భారత్‌లో 2023 హాకీ ప్రపంచకప్‌: అత్యధిక సార్లు ఆతిథ్యమివ్వనున్న దేశంగా భారత్ రికార్డు

0
1


హైదరాబాద్: పురుషుల హాకీ ప్రపంచకప్‌కు వరుసగా రెండోసారి భారత్‌ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ మేరకు అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్‌ఐహెచ్‌) ప్రకటించింది. 2023లో జరగనున్న ఈ హాకీ ప్రపంచకప్‌ 2023 జనవరి 13 నుంచి 29 వరకు భారత్‌లో జరగనుంది. అదే ఏడాది భారత్‌కు స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తి కానున్నాయి.

ఈ నేపథ్యంలో ఆతిథ్య హక్కుల కోసం బిడ్ వేసిన హాకీ ఇండియా (హెచ్‌ఐ) మొత్తానికి తన పంతాన్ని నెగ్గించుకుంది. బెల్జియం, మలేషియాతో పోటీపడి భారత్ ఈ అవకాశం దక్కించుకుంది. దీంతో అత్యధిక సార్లు ప్రపంచకప్‌కు ఆతిథ్యమివ్వనున్న దేశంగా రికార్డుల్లోకి ఎక్కింది.

రిషబ్ పంత్ పంత్ సూపర్ ప్లేయర్, కొంచెం సమయం ఇవ్వండి: గంగూలీ మద్దతు

గతంలో భారత్‌ (1982 ముంబై, 2010 ఢిల్లీ, 2018 భువనేశ్వర్‌), నెదర్లాండ్స్‌ మూడేసి సార్లు పురుషుల ప్రపంచకప్‌కు ఆతిథ్యమిచ్చాయి. తాజాగా, భారత్ ఇప్పుడు నాలుగోసారి ఆ హక్కులు చేజిక్కించుకొని నెదర్లాండ్స్ (3 సార్లు)ను వెనక్కి నెట్టింది.

మరోవైపు 2022లో జరుగునున్న మహిళల ప్రపంచకప్‌ను స్పెయిన్, నెదర్లాండ్స్ ఉమ్మడిగా నిర్వహించనున్నాయి. ఈ మేరకు శుక్రవారం జరిగిన ఎఫ్‌ఐహెచ్‌ ఎగ్జిక్యూటివ్‌ బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here