భారత్‌లో 500 మంది ఉద్యోగుల్ని తొలగించిన క్యాప్‌జెమిని

0
0


భారత్‌లో 500 మంది ఉద్యోగుల్ని తొలగించిన క్యాప్‌జెమిని

న్యూఢిల్లీ: టెక్ కంపెనీల్లో ఉద్యోగాల కోతల భయాలు కనిపిస్తున్నాయి. కాగ్నిజెంట్ 7వేల నుంచి 13 వేల మంది ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమవుతోందని ఇటీవల వార్తలు వచ్చాయి. తాజాగా, బెంగళూరు బేస్డ్ టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్‌లోను 10,000కు పైగా ఉద్యోగాలు పోనున్నాయని చెబుతున్నారు. అయితే ఇది జాబ్ కట్ కాదని, పనితీరు బాగా లేని వారిని తొలగించడం సహజమేనని కంపెనీలు చెబుతున్నాయి. కానీ దీనిని కాస్ట్ కట్టింగ్‌గా భావిస్తున్నారు.

కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్ కంటే ముందే మరో గ్లోబల్ ఐటీ కంపెనీ క్యాప్‌జెమిని కూడా ఉద్యోగులను తొలగించింది. భారత్‌లో ఈ కంపెనీ 500 ఉద్యోగులను తీసేసింది. కొందరు క్యాప్‌జెమినీ కస్టమర్లు తమ ప్రాజెక్టులు వెనక్కి తీసుకోవడం, మరికొన్ని కంపెనీల అకౌంట్స్ వేగంగా పెరగలేదు. ఈ నేపథ్యంలో ఉద్యోగులను తొలగించింది.

క్యాప్‌జెమిని తన ఉద్యోగులకు బిల్లబుల్ బ్రాజెక్టుల పైన 90 రోజుల పాటు సమయం ఇస్తుందని, తొలగించబడిన ఉద్యోగులు బిల్ చేయదగిన ప్రాజెక్టులను కనుగోలేకపోయినందున తొలగించినట్లుగా తెలుస్తోంది. భారత్‌లో క్యాప్‌జెమినీలో 1.08 లక్షల మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా క్యాప్‌జెమినీలోని ఉద్యోగుల్లో భారత్ వాటానే సగానికి ఎక్కువగా ఉంది. అన్ని కంపెనీల మాదిరిగానే తమ కంపెనీలోను కాన్‌స్టాంట్ ఔట్ ప్లో, రీస్కిల్లింగ్, అరైవల్స్ ఉంటాయని చెబుతోందట.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here