భారత్‌ పెట్రోలియం బంక్‌ను ప్రారంభించిన సుదర్శన్‌రెడ్డి

0
1



నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని సాటాపూర్‌ గ్రామంలో నూతనంగా నిర్మించిన భారత్‌ పెట్రోలియం బంక్‌ను శుక్రవారం మాజీమంత్రి సుదర్శన్‌ రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో సాటాపూర్‌ గ్రామంలో భారత్‌ పెట్రోలియం బంక్‌ను ఏర్పాటు చేయడం అభినందనీయమని రెంజల్‌ మండల ప్రజలకు అందుబాటులో ఉపయోగకరంగా ఉందన్నారు. కార్యక్రమంలో భారత్‌ పెట్రోలియం మేనేజర్‌ గున్నారవ్‌, హరీష్‌ పహడియా, టిపిసిసి అధికార ప్రతినిధి కెప్టెన్‌ కరుణాకర్‌ రెడ్డి, టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శులు గడుగు గంగాధర్‌, మహేష్‌ కుమార్‌ గౌడ్‌, పట్టణ ఇంచార్జి తహెర్‌ బిన్‌ హందాన్‌, భారత్‌ పెట్రోలియం పొప్రేటర్‌ జవేదోద్దీన్‌, మాజీ ఎంపీపీ మోబిన్‌ ఖాన్‌ ఉన్నారు.



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here