భారత్ లో బిజినెస్ డెవలప్మెంట్ భేష్ .. భవిష్యత్ మార్కెట్ కూడా శభాష్ అని తేల్చిన సర్వే

0
2


భారత్ లో బిజినెస్ డెవలప్మెంట్ భేష్ .. భవిష్యత్ మార్కెట్ కూడా శభాష్ అని తేల్చిన సర్వే

భారతదేశంలో వ్యాపారాభివృద్ధికి ఢోకా లేదని హెచ్‌ఎస్‌బీసీ తేల్చేసింది. భారత్‌లోని విస్తృతమైన మార్కెట్‌, సాంకేతిక పరిజ్ఞానాన్ని, సృజనాత్మకతను అంది పుచ్చుకోవడంలో చూపుతున్న చొరవ భారత దేశాన్ని ప్రపంచ మార్కెట్ లో ముందు వరసలో ఉంచిందని పేర్కొంది. ప్రపంచ మార్కెట్‌లో పెట్టుబడులకు భారతదేశ వ్యాపార రంగం ఆశాజనకంగా కనిపిస్తోందని హెచ్‌ఎస్‌బీసీతన నివేదికలో వెల్లడించింది .

‘భవిష్యత్తును సూచించే దిక్చూచి’ పేరిట హెచ్‌ఎస్‌బీసీ ఒక సర్వేను నిర్వహించింది. ఇక ఈ సర్వే కోసం ఆస్ట్రేలియా, కెనడా, చైనా, ఫ్రాన్స్‌, జర్మనీ, హాంకాంగ్‌, భారత్‌, ఇండోనేషియా, మలేసియా, మెక్సికో, సింగపూర్‌, యూఏఈ, యూకే, యూఎస్‌ఏ దేశాలలోని వ్యాపారాభివృద్ధి పై వివరాలు సేకరించింది . ఇందులో ఇండోనేషియా తర్వాత సగటున 10లో 9 భారతీయ సంస్థలు రాబోయే రెండేళ్లలో మంచి వృద్ధిరేటును నమోదు చేస్తాయని తెలిపింది. భారత్ వ్యాపార రంగంలో గణనీయమైన ప్రగతి సాధిస్తుందని, భారత దేశ వ్యాపారాభివృద్ధి ఆశాజనకంగా ఉందని పేర్కొంది.

మొత్తం 14 దేశాల మార్కెట్లలోని మొత్తం 2500 కంపెనీలు ఈ సర్వేలో పాల్గొన్నాయి. గత ఐదేళ్లలో అత్యంత తక్కువ వృద్ధిరేటు 6.8 శాతం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నమోదైంది. అయినప్పటికి భారత్‌ వ్యాపార రంగానికి ఏ ఢోకా లేదని వెల్లడించింది. భారత్‌లో ఉన్న మార్కెట్ , టెక్నాలజీ, క్రియేటివిటీ భారత్‌ మార్కెట్‌ అగ్రగామిగా నిలవడానికి కారణాలని హెచ్‌ఎస్‌బీసీ ఇండియా హెడ్‌ రజత్‌వర్మ తెలిపారు. ఇక సాంకేతికంగా అభివృద్ధి చెందటం కూడా భారత్ కు ప్లస్ పాయింట్ అన్నారు .

అలాగే ఉద్యోగుల నైపుణ్యాభివృద్ధి కోసం శిక్షణ ఇవ్వటం, వీలైనంత వరకు ఆన్‌లైన్‌లో ఉత్పత్తుల క్రయ విక్రయాలను చేయటం ద్వారా వినియోగదారుల అభిరుచి తెలుసుకుంటున్నారని కితాబిచ్చారు . వినియోగదారుల అభిరుచికి తగ్గట్టు వారికి కావాల్సిన ఉత్పత్తులను తయారు చేస్తూ వ్యాపారాలను వృద్ధి చేస్తున్నారని పేర్కొన్నారు. ఇది కూడా వ్యాపారం స్థిరంగా కొనసాగేందుకు ఒక బలమైన కారణం అని రజత్‌వర్మ వివరించారు. ఏది ఏమైనా భారతదేశంలో వ్యాపారాభివృద్ధి భవిష్యత్ లో మూడు పువ్వులు , ఆరు కాయలుగా ఉంటుందని పేర్కొన్నారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here