భారీ నష్టాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు, 200 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్

0
0


భారీ నష్టాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు, 200 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్

ముంబై: మార్కెట్లు శుక్రవారం నాడు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం సెన్సెక్స్ 234 పాయింట్లు కోల్పోయి 37,076 వద్ద, నిఫ్టీ 74 పాయింట్ల నష్టంతో 10,955 వద్ద ట్రేడ్ అయింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ.71.36గా ఉంది. యస్ బ్యాంక్, ఓఎన్జీసీ, కోల్ ఇండియా, ఇన్ఫోసిస్‌, సన్ ఫార్మాలు లాభాల్లో ట్రేడ్ అయ్యాయి. హీరో మోటో కార్ప్, మారుతీ సుజుకీ, వేదాంతా, టాటా స్టీల్, టాటా మోటార్స్ తదితర కంపెనీల షేర్లు నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి.

సెన్సెక్స్ ఉదయం ఏకంగా 325 పాయింట్లు దిగజారి 36,986 వద్ద కూడా ట్రేడ్ అయింది. ఆ తర్వాత కాస్త కోలుకుంది. ఉదయం పది గంటల సమయంలో 184 పాయింట్లు (0.48 శాతం) నష్టపోయి 37,127 వద్ద ట్రేడ్ అయింది. నిఫ్టీ 59 పాయింట్లు (0.52 శాతం) కోల్పోయి 10,970 వద్ద ట్రేడ్ అయింది.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here