భారీ నష్టాల్లో మార్కెట్లు: 400 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్, ఎస్బీఐ సహా ఈ షేర్లు డౌన్

0
3


భారీ నష్టాల్లో మార్కెట్లు: 400 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్, ఎస్బీఐ సహా ఈ షేర్లు డౌన్

ముంబై: మంగళవారం స్వల్ప నష్టాల్లో ముగిసిన మార్కెట్లు బుధవారం కూడా నష్టాల్లో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. అంతర్జాతీయ ప్రతికూల సంకేతాల నేపథ్యంలో మార్కెట్లు బుధవారం నష్టాల్లో ఉన్నాయి. ఉదయం 9.51 సమయంలో సెన్సెక్స్ 298 పాయింట్లు నష్టపోయి 38,798 వద్ద, నిఫ్టీ 85 పాయింట్లు కోల్పోయి 11,503 వద్ద ట్రేడ్ అయింది. ఆ తర్వాత పదిన్నర గంటల సమయానికి సెన్సెక్స్ ఏకంగా 420.53 (1.08%) పాయింట్లు నష్టపోయి 38,676.61 వద్ద, 118.45 (1.02%) పాయింట్లు కోల్పోయి 11,469.75 వద్ద ట్రేడ్ అయింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 70.70 వద్ద ఉంది.

చైనాతో అసమంజస ఒప్పందానికి అంగీకరించేది లేదని అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. దీంతో చమురు ధరలు రెండు శాతం మేర పడిపోయాయి. అలాగే ట్రంప్ పైన అభిశంసనకు అమెరికా చట్ట ప్రతినిధులు విచారణ కోరారు. దీంతో ఆసియా మార్కెట్లు గందరగోళానికి గురయ్యాయి. దీంతో భారత మార్కెట్లు నష్టాలను మూటగట్టుకుంటున్నాయి.

సిమెంట్ రంగ స్టాక్స్ నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి. శివా సిమెంట్స్, ఆంధ్రా సిమెంట్స్, శ్రీ కేశవ్ సిమెంట్స్, బారాక్ వ్యాలి సిమెంట్స్, దాల్మియా సిమెంట్స్, జేకే సిమెంట్స్, పిజమ్ జాన్సన్ నష్టాలను చవి చూడగా, కాకతీయా సిమెంట్స్, ఇండియా సిమెంట్స్, అల్ట్రా టెక్ సిమెంట్స్ లాభాల్లో ఉన్నాయి.

ఆటో షేర్లు కూడా నష్టాల్లో ఉన్నాయి. టాటా మోటార్స్, మదర్సన్ సుమీ సిస్టమ్స్, అశోక్ లేలాండ్, ఎయిచర్, భారత్ ఫోర్జ్, ఎక్సైడ్ ఇండస్ట్రీస్, మారుతీ సుజుకీ ఇండియా షేర్లు నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి. SBI, HDFC, టాటా మోటార్స్ షేర్లు 2 శాతం నుంచి 3 శాతం మధ్య నష్టపోయాయి.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here