భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు: 600 పాయింట్ల కోల్పోయిన సెన్సెక్స్, 10,800 వద్ద నిఫ్టీ

0
2


భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు: 600 పాయింట్ల కోల్పోయిన సెన్సెక్స్, 10,800 వద్ద నిఫ్టీ

ముంబై: స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. గత వారం మార్కెట్లు భారీ నష్టాల్లో కూరుకుపోయిన విషయం తెలిసిందే. అంతర్జాతీయ పరిణామాలతో పాటు ప్రస్తుతం కాశ్మీర్‌లోని అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో మార్కెట్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి.

ఉదయం గం.9.30 నిమిషాలకు బాంబేస్టాక్ ఎక్స్‌చెంజ్ సెన్సెక్స్ 500 పాయింట్లు పతనమైంది. నిఫ్టీ 164 పాయింట్లు కోల్పోయింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 70.46 వద్ద ట్రేడ్ అవుతోంది.

పది గంటల సమయానికి సెన్సెక్స్ ఏకంగా 675 పాయింట్లు నష్టపోయింది. నిఫ్టీ 10,800 మార్క్‌కు దిగువకు పడిపోయింది. 2019 సంవత్సరంలో నిఫ్టీ పొందిన లాభాలను ఈ ఒక్కరోజుతో తుడిసిపెట్టేసేలా కనిపిస్తోంది. అయితే, కాసేపటికి నిఫ్టీ 10,800 మార్కు పైకి చేరుకుంది. సెన్సెక్స్ 550 పాయింట్ల నష్టంతో ట్రేడ్ అయింది.

సోమవారం ఉదయం HDFC, TCS, NTPC, HCL Tech, ఇన్ఫోసిస్‌ షేర్లు లాభాల్లో ట్రేడ్ అయ్యాయి. ఐసీఐసీఐ, యాక్సిస్ బ్యాంకు, బ్రిటానియా, బజాజ్ ఫినాన్స్, హీరో మోటార్ కార్ప్, DHFL, LIC హౌసింగ్, ఇండియా బుల్స్ హౌసింగ్ షేర్లు నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి. దాదాపు అన్ని రంగాల్లో షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here