భార్య వీసాతో ఇంగ్లాండ్‌లో సెటిల్ అవనున్న పాకిస్థాన్ పేసర్!

0
2


హైదరాబాద్: ఇటీవలే అంతర్జాతీయ టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలికిన పాకిస్థాన్ పేసర్‌ మహ్మద్‌ ఆమీర్‌ ఇంగ్లాండ్‌లో సెటిల్ అవనున్నాడా? అంటే అవుననే వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం పాక్ పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో రెగ్యులర్ ఆటగాడిగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

ప్రో కబడ్డీ 7వ సీజన్ వార్తలు, పాయింట్ల పట్టిక కోసం క్లిక్ చేయండి

కాగా, బ్రిటీష్‌ పౌరసత్వం కల్గిన నర్గీస్‌ మాలిక్‌ను ఆమిర్‌ మూడేళ్ల క్రితం వివాహం చేసుకోవడంతో అతనికి ఇంగ్లండ్‌లో సెటిల్‌ కావడానికి అవకాశం ఉంది. భార్య వీసా మీద ఆమీర్‌ ఇంగ్లండ్‌లో స్థిరపడే అవకాశం ఉన్నందున ఇప్పుడు ఆ దిశగా తన ప్రయత్నాలను ముమ్మరం చేసినట్లు సమాచారం.

“ప్రస్తుతం ఆమీర్ బ్రిటీష్ పాస్‌పోర్టు పొందేందుకు ప్రయత్నిస్తున్నాడు. భవిష్యత్తులో ఇంగ్లాండ్‌లో స్ధిరపడతాడు. తన భార్య వీసాతో ఆమీర్ UKలో శాశ్వత నివాసిగా స్వేచ్ఛగా పని చేయవచ్చు. అక్కడి లభించే ఇతర ప్రయోజనాలను పొందవచ్చు. త్వరలో ఇంగ్లాండ్‌లో అతడు ఇల్లు కొనుగోలు చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నాడు” అని పాక్ మీడియా పేర్కొంది.

కాగా, 27 ఏళ్ల ఆమీర్ గత శుక్రవారం టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. 2009, జులైలో గాలే వేదికగా శ్రీలంకతో జరిగిన టెస్టుతో అంతర్జాతీయ టెస్టు అరంగేట్రం చేసిన మహ్మద్ ఆమీర్ పాక్ తరుపున మొత్తం 36 టెస్టులాడాడు. 17 ఏళ్ల వయసులో టెస్టు అరంగేట్రం చేసిన ఆమీర్ 30.47 యావరేజితో మొత్తం 119 వికెట్లు తీశాడు.

రిటైర్మెంట్ ప్రకటించిన పాక్ పేసర్ మహ్మద్ ఆమీర్

2010లో స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలతో ఆమిర్ కెరీర్ ప్రమాదంలో పడింది. ఫిక్సింగ్‌లో దోషిగా తేలడంతో అతడు 2010 నుంచి ఐదేళ్ల పాటు నిషేధాన్ని ఎదుర్కొన్నాడు. కొంతకాలం జైలు జీవితాన్ని కూడా గడిపాడు. కాగా, ఆమీర్ రిటైర్మెంట్‌పై పాక్‌ మాజీ క్రికెటర్లు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

27 ఏళ్లకే టెస్టు క్రికెట్‌కే గుడ్‌ బై చెప్పి పాక్‌ క్రికెట్‌ను మరింత కష్టాల్లోకి నెట్టావంటూ మాజీ పేసర్‌ షోయబ్‌ అక్తర్‌ విమర్శించాడు. అసలు నీలాంటి వాళ్లను ఏ ఫార్మాట్‌ క్రికెట్‌ ఆడకుండా చేయాలంటూ మండిపడ్డాడు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here