భీమవరానికి పవన్ కల్యాణ్: ఓటమి తరువాత తొలిసారిగా

0
2


భీమవరానికి పవన్ కల్యాణ్: ఓటమి తరువాత తొలిసారిగా

ఏలూరు: జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఆదివారం పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. దీనికోసం ఆయన ఆదివారం మధ్యాహ్నం రాజమహేంద్రవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. హైదరాబాద్ నుంచి బయలుదేరిన ఆయన మధ్యాహ్నం 2 గంటలకు రాజమహేంద్రవరం విమానాశ్రయంలో దిగారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ జిల్లా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఆయనను సాదరంగా ఆహ్వానించారు. రాజమహేంద్రవరం నుంచి రోడ్డు మార్గం గుండా సిద్ధాంతం మీదుగా పవన్ కల్యాణ్ పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరానికి వెళ్తారు.

ఎన్నికల తరువాత తొలిసారిగా..

అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల తరువాత పవన్ కల్యాణ్ తొలిసారిగా జిల్లాకు రానున్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కల్యాణ్ భీమవరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి, ఓడిపోయారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన గ్రంధి శ్రీనివాస్ ఆయనపై భారీ మెజారిటీతో విజయం సాధించారు. భీమవరం పర్యటన సందర్భంగా ఆయన సాయంత్రం 6 గంటలకు పార్టీ ముఖ్య నాయకులతో సమావేశమవుతారు.

5వ తేదీ ఉదయం 10 గంటలకు తాడేరుకు చెందిన పార్టీ కార్యకర్త దివంగత కొప్పినీడు మురళీ కుటుంబాన్ని పరామర్శిస్తారు. జనసేన పార్టీలో క్రియాశీలక కార్యకర్త మురళీ.. కొద్దిరోజుల కిందటే క్యాన్సర్ తో మరణించారు. ఆయన కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం పవన్ కల్యాణ్ నరసాపురం వెళ్తారు. రాత్రికి అక్కడే బస చేస్తారు. సోమవారం నుంచి నరసాపురం లోక్ సభలో పార్టీ స్థితిగతులపై సమీక్ష నిర్వహిస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు నరసాపురం పార్లమెంటరీ పరిధిలోని కార్యకర్తలతో ముఖాముఖి సమావేశంలో పాల్గొంటారు.

ఆ రెండు జిల్లాలే..

రెండురోజుల కిందటే పవన్ కల్యాణ్ కాకినాడ లోక్ సభ నియోజకవర్గం పరిధిలో పార్టీ పరిస్థితిపై సమీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. కాకినాడ లోక్ సభ పరిధిలోకి వచ్చే అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన కార్యకర్తలు, నాయకులతో ఆయన ముఖాముఖి సమావేశాన్ని నిర్వహించారు. కార్యకర్తల మనోగతాన్ని తెలుసుకున్నారు. ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఇక- పశ్చిమ గోదావరి జిల్లాపై ఆయన దృష్టి కేంద్రీకరించారు. పవన్ కల్యాణ్ తొలిదశలో ఈ రెండు జిల్లాల్లోనే పర్యటిస్తారని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. నరసాపురం లోక్ సభపై సమీక్ష ముగిసిన తరువాత కనీసం రెండు వారాల పాటు ఆయన విశ్రాంతి తీసుకుంటారని అనంతరం- ఉత్తరాంధ్ర జిల్లా పర్యటనలకు బయలుదేరి వెళ్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. వారం రోజుల వ్యవధిలో శ్రీకాకుళం, విజయనగరం లోక్ సభ నియోజకవర్గాల సమీక్ష నిర్వహించిన తరువాత భవిష్యత్ ప్రణాళిక రూపొందిస్తారని అంటున్నారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here