భూదస్త్రాల ప్రక్షాళన పారదర్శకంగా చేపట్టాలి

0
1


భూదస్త్రాల ప్రక్షాళన పారదర్శకంగా చేపట్టాలి

సమీక్షలో మాట్లాడుతున్న పాలనాధికారి సత్యనారాయణ

కామారెడ్డి కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: భూదస్త్రాల ప్రక్షాళనను పారదర్శకంగా చేపట్టాలని జిల్లా పాలనాధికారి సత్యనారాయణ పేర్కొన్నారు. జనహితభవన్‌లో ఆర్డీవోలు, తహసీల్దార్లుతో నిర్వహించిన వీసీలో ఆయన బుధవారం మాట్లాడారు. ఎల్‌ఆర్‌యూపీ పెండింగ్‌ భూరికార్డులను వెంటనే ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని, రైతులకు అందజేయాల్సిన 1122 డిజిటల్‌ పాసు పుస్తకాలను వెంటనే ముద్రించి పంపిణి చేయాలని సూచించారు. జిల్లాలో 12,158 ఎకరాల భూమి వివరాలను, ప్రతీ మండలంలోని ప్రభుత్వ భవనాల వివరాలను నవీకరించాలని ఆదేశించారు.

సహాయ నంబర్లను సద్వినియోగం చేసుకోవాలి

కామారెడ్డి కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: విపత్కర పరిస్థితుల్లో సహాయ(హెల్ఫ్‌లైన్‌) నంబర్లను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ సత్యనారాయణ కోరారు. జనహిత భవన్‌లో అధికారులతో బుధవారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. అధిక వర్షాలు, ఉరుములు, మెరుపులు వస్తున్నప్పుడు తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కల్పించారు.అత్యవసర పరిస్థితుల్లో…

పోలీసుశాఖ- 100, అగ్నిమాపకశాఖ-101, అంబులెన్స్‌-108, గ్రామీణ స్థాయి వైద్యసేవలు-104, అమ్మఒడి సేవలు-102, పిల్లల హెల్ప్‌లైన్‌-1098, లింగ ఆధారిత హింస, సఖికేంద్రం- 181, విద్యాశాఖ- 1800-425-3535, పశువైద్యశాఖ అంబులెన్స్‌-1982, ఎన్నికల ఓటరు సహాయ కేంద్రం-1950 నంబర్లను సంప్రదించాలని సూచించారు.

నేడు 2కే రన్‌

కామారెడ్డి కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: రాష్ట్రీయ ఎక్తాదివాస్‌ వల్లబాయ్‌ పటేల్‌ జయంతి సందర్భంగా గురువారం 2కె పరుగు నిర్వహించనున్నారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుంచి ప్రారంభమయ్యే పరుగులో జిల్లా పాలనాధికారి సత్యనారాయణ పాల్గొంటారు.

హరితహారం ప్రణాళికలు రూపొందించాలి

కామారెడ్డి కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: హరితహారం పథకంలో భాగంగా 2019-20 సంవత్సరంలో మొక్కలు నాటేందుకు అటవీశాఖ, డీఆర్‌డీఏ శాఖలు ప్రణాళికలు రూపొందించుకోవాలని జిల్లా పాలనాధికారి సత్యనారాయణ సూచించారు. కలెక్టరేట్‌లోని ఆయన ఛాంబర్‌లో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. రెండు శాఖలు సమన్వయంతో 82.36 లక్షల మొక్కలు నాటించాలని సూచించారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here