భూమిని ధ్వంసం చేస్తున్నాం, అందుకే రూ.కోట్లు ఖర్చు చేస్తున్నా: జెఫ్ బెజోస్

0
1


భూమిని ధ్వంసం చేస్తున్నాం, అందుకే రూ.కోట్లు ఖర్చు చేస్తున్నా: జెఫ్ బెజోస్

వాషింగ్టన్: బ్లూమ్‌బర్గ్ బిలియనీర్ ఇండెక్స్ ప్రకారం ప్రపంచ కుబేరుడు అమెజాన్ బాస్ జెఫ్ బెజోస్ ఆస్తి 125 బిలియన్ డాలర్లు. తన సంపదలోని ఎక్కువ మొత్తాన్ని ఆయన స్పెస్ టెక్నాలజీ అభివృద్ధి కోసం వినియోగిస్తున్నాడు. బ్లూఆరిజిన్ (Blue Origin) పేరుతో ఏరోస్పేస్ కంపెనీని ప్రారంభించాడు. ఏరో స్పేస్ టెక్నాలజీ కోసం పెద్ద మొత్తంలో ఖర్చు చేయడానికి ఆయన ఓ బలమైన కారణాన్ని వెల్లడించాడు.

స్పేస్ టెక్నాలజీకి పెద్ద మొత్తంలో ఖర్చు

జెఫ్ బెజోస్ తన ఏరో స్పేస్ కంపెనీ బ్లూ ఆరిజిన్‌ను పంతొమ్మిది సంవత్సరాల క్రితం స్థాపించాడు. దీని హెడ్ క్వార్టర్ వాషింగ్టన్.. కెంట్‌లో ఉంది. ఇందులో దాదాపు 2000 మంది పని చేస్తున్నారు. స్పేస్ టెక్నాలజీ కోసం తాను ఎందుకు పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తున్నాననే అంశాన్ని ఆయన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

నా జీవితమంతా ఆలోచిస్తూనే ఉంటా

నా జీవితమంతా ఆలోచిస్తూనే ఉంటా

స్పేస్ టెక్నాలజీలో పెట్టుబడులు చాలా ముఖ్యమని తాను భావించానని జెఫ్ బెజోస్ చెప్పారు. మన ప్లానెట్ కోసం ఇది చాలా ముఖ్యమని భావిస్తున్నానని, అలాగే, భవిష్యత్తు తరాలకు కూడా అవసరమని తాను భావిస్తున్నానని చెప్పారు. దీనిపై తాను ప్రత్యేకంగా ఎంతో దృష్టి సారిస్తున్నానని చెప్పారు. తన జీవితమంతా ఆలోచిస్తూనే ఉంటానన్నారు.

భూమిపై వాతావరణ కాలుష్యం

భూమిపై వాతావరణ కాలుష్యం

మీ అభిరుచులను మీరు ఎంచుకోరని, మీ అభిరుచి మిమ్మల్ని ఎంచుకుంటాయని జెఫ్ బెజోస్ అన్నాడు. అభివృద్ధి చెందుతున్న నాగరికతను కొనసాగించాలంటే మనం అంతరిక్షంలోకి వెళ్లాలన్నాడు. జనాభా ఎక్కువగా ఉందని, వేగంగా పెరుగుతోందని, అదే సమయంలో ఈ భూమి చిన్నదిగా అవుతోందన్నారు. వాతావరణ మార్పులు, కాలుష్యం, భారీ పరిశ్రమలు మనం చూస్తున్నామన్నారు.

భూమిని ధ్వంసం చేస్తున్నాం

భూమిని ధ్వంసం చేస్తున్నాం

మనం ఈ గ్రహాన్ని నాశనం లేదా ధ్వంసం చేసే పనిలో ఉన్నామని జెఫ్ బెజోస్ అన్నాడు. ప్రతి గ్రహానికి రోబోటిక్ ప్రోబ్స్ పంపించామన్నాడు. ఇది శుభపరిణామమని, మనం ఈ గ్రహాన్ని కాపాడుకోవాల్సిన అవసరముందన్నాడు. ఈ భూమిని కాపాడాలంటే అంతరిక్షంలో జీవనం, పని చేయడం అవసరమన్నాడు.

అంతరిక్షంలోనే తయారు చేస్తే...

అంతరిక్షంలోనే తయారు చేస్తే…

మనం అన్ని వస్తువులను అంతరిక్షంలోకి పంపిస్తున్నామని, కానీ అవన్నీ భూమి పైనే తయారవుతున్నాయని జెఫ్ బెజోస్ అన్నాడు. మైక్రోప్రాసెసర్స్ సహా కాంప్లికేటెడ్ వస్తువులను స్పేస్‌లోకి వెళ్లి తయారు చేయడం ఇక సులభం, చౌక అవుతాయని, వాటిని భూమిపైకి పంపించడం మంచిదని చెప్పాడు. అలా చేస్తే భూమిపై పొల్యూషన్ తగ్గుతుందన్నాడు. ప్రజలు భూమిపై, ఇతర ప్లానెట్స్ పైన ఉండేందుకు సిద్ధమన్నాడు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here