భూమి వైపు దూసుకొస్తున్న భారీ గ్రహశకలం, 19 ఏళ్ల తర్వాత మళ్లీ..

0
0


భారీ గ్రహశకలం భూమిని సమీపిస్తోంది. సుమారు 650 మీటర్ల పరిమాణం గల ఈ భారీ గ్రహశకలం.. భూమి కంటే చిన్నదే. కానీ, అది ఢీకొడితే అణుబాంబు పేలినంత శక్తి విడుదలవుతుంది. ఈ నేపథ్యంలో పరిశోధకులు ఈ గ్రహశకలంపై ప్రత్యేకంగా దృష్టిసరించారు. మరికొద్ది రోజుల్లో ఇది భూమికి అత్యంత సమీపంగా వస్తుందని తెలిపారు.

2000 QW7 అనే గ్రహశకలం ప్రస్తుతం భూమికి 5 మిలియన్ మైళ్ల దూరంలో ఉంది. గంటకు 23 వేల కిమీల వేగంతో దూసుకొస్తోంది. సెప్టెంబర్ 14న ఇది భూమికి అత్యంత దగ్గరగా వస్తుంది. ఆ తర్వాత కూడా దాని గమనం భూమి దిశగా సాగితే ప్రమాదం తప్పదని భావిస్తున్నారు. అది భూమిపై ఎక్కడ పడుతుందనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు.

Read also: భూమికి భారీ ముప్పు, ఆ గ్రహశకలాన్ని ఎదుర్కోలేం.. ఎలన్ మస్క్ వెల్లడి

ఇటీవల 2019 OD గ్రహశకలం జులై 24న చంద్రుడి కక్ష్యను దాటి భూమి వైపునకు దూసుకొచ్చింది. అయితే, అది దిశ మార్చుకోవడంతో గండం తప్పింది. 2000QW7 గ్రహశకలం కూడా ఇలాగే దిశ మార్చుకుంటే భూమికి ఎలాంటి ముప్పు ఉండదు. ఒక వేళ భూమిని ఢీకొడితే మాత్రం విధ్వంసం తప్పదు.

Read also:
ఆ గ్రహశకలంలో బోలెడంత బంగారం.. భూమిని తాకితే డబ్బే డబ్బు!

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనం బుర్జ్ ఖలిఫా (828 మీటర్లు) అంత పరిమాణంలో ఈ గ్రహశకలం ఉందని, ఇది భూమిని తాకితే దాదాపు ఒక నగరం పూర్తిగా ధ్వంసమవుతుందని అంచనా వేస్తున్నారు. సూర్యుడి కక్ష్యలో పరిభ్రమించిన ఈ గ్రహశకలం 2000 సంవత్సరం, సెప్టెంబరు 1న కూడా ఇలాగే భూమిని సమీపించి దిశ మార్చుకుంది. ఈ సారి కూడా భూమిని తాకనట్లయితే మళ్లీ 2038, అక్టోబర్ 19న సమీపిస్తుందని పరిశోధకులు తెలిపారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here