భూ పంచాయతీలతో రెవిన్యూ శాఖ బద్నామ్‌

0
2నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్రంలో భూ రికార్డులను పరిశీలించి అర్హులైన వారికి పట్టాలు పట్టాపాస్‌బుక్‌లు అందించడంలో రెవెన్యూ అధికారులు పకడ్బంధీగా పనిచేస్తున్నా ఏదో ఒక చోట రెవెన్యూ సిబ్బందిపై నానా రకాలుగా శారీరక, మానసికంగా దాడులు జరుగుతున్నాయని రెవిన్యూ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ దాడులను అరికట్టాల్సిన అవసరం ప్రభుత్వానికి ఎంతైనా ఉందన్నారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌ మెట్‌ తహసీల్దార్‌ విజయారెడ్డి హత్య రెవెన్యూశాఖను కలచివేసిందని అన్నారు. ఆమె హత్యను నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ ఉద్యోగులు చేపట్టిన మూడు రోజుల నిరసన దీక్షలో భాగంగా గురువారం మండలం కేంద్రంలోని రెవిన్యూ కార్యాలయాన్ని మూసి ప్రభుత్వానికి నిరసన తెలిపారు. రాష్ట్రంలో ఇటీవల చేపట్టిన భూ ప్రక్షాళనలో భాగంగా భూ రికార్డులను సరిచేసి ఉన్న వారికి భూములను సరిచేసి రికార్డులను అందించామని ఎక్కడో చోట తమకు న్యాయం జరగలేదని ఆరోపిస్తూ రెవెన్యూ సిబ్బందిపై ఆరోపణలు, దాడులు జరిగాయని కానీ ఇటీవల విజయరెడ్డిపై హత్య మాత్రం అందరినీ ద్రిగ్భాంతికి గురి చేసిందన్నారు. రెవెన్యూ సిబ్బంది నేరం చేసినట్లు కేవలం రెవెన్యూశాఖనే లంచగొండిగా అధికార పార్టీ నాయకులూ పేర్కొనడం సబబు కాదన్నారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here