మంచి ప్రాంతముంటే చక్కటి ఆలోచనలు

0
2


మంచి ప్రాంతముంటే చక్కటి ఆలోచనలు

పోతాయిపల్లిలో పరిసరాలను పరిశీలిస్తున్న కలెక్టర్‌ సత్యనారాయణ

లింగంపేట, న్యూస్‌టుడే: మంచి ప్రాంతం ఉన్న చోట చక్కటి ఆలోచనలు వస్తాయని జిల్లా పాలనాధికారి సత్యనారాయణ అన్నారు. పోతాయిపల్లిలో శనివారం 30 రోజుల ప్రణాళికలో చేపట్టిన పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామంలో తిరుగుతూ పరిసరాలను పరిశీలించారు. పంచాయితీ ఆవరణలో మొక్కనాటి నీళ్లు పోశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు.. బంగారు సమాజ నిర్మాణం కోసం ప్రభుత్వం 30 రోజుల ప్రణాళిక కార్యక్రమాన్ని ప్రవేశపెట్టినట్లు చెప్పారు. గ్రామాలు నందనవనాలుగా మారడానికి ప్రభుత్వం ప్రతి నెలా జిల్లాకు సుమారు రూ. 17 కోట్ల నిధులు విడుదల కానున్నాయని చెప్పారు. కార్యక్రమంలో అసిస్టెంట్‌ కలెక్టర్‌ తేజస్‌నందలాల్‌పవార్‌, సర్పంచి లక్ష్మీనారాయణ, ఎంపీడీవో మల్లికార్జున్‌రెడ్డి, ఎంపీవో ప్రభాకర్‌చారి, ఎంపీటీసీ సభ్యురాలు కల్యాణి, ఉపసర్పంచి అంజయ్య, సింగిల్‌ విండో డైరక్టర్‌ మల్లయ్య, కార్యదర్శి రాజయ్య పాల్గొన్నారు.

రోడ్డు పనులు పూర్తి చేయాలని వినతి

గ్రామానికి చెందిన రైతులు పట్టాలు ఇప్పటి వరకు అందించలేదని కలెక్టర్‌తో మొరపెట్టుకున్నారు. రైతు నీరడి భూమయ్య భూమి పట్టా రాలేదని కలెక్టర్‌ను వేడుకోగా పట్టా అందించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. నందివాడకు వెళ్లే రహదారి పనులు మధ్యలో నిలిచిపోయినట్లు, ఒర్రె దాటడానికి పైపులు అందిస్తే గ్రామస్థులమే వేసుకుంటామని పరిస్థితి చక్కదిద్దుతానని హామీ ఇచ్చారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here