మంచు విష్ణు హాలీవుడ్ మూవీలో బాలీవుడ్ హీరో

0
6


మంచు విష్ణు హీరోగా ఓ హాలీవుడ్ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. హాలీవుడ్ డైరెక్టర్ జెఫెరీ చిన్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో కీలక పాత్ర కోసం బాలీవుడ్ హీరో సునీల్ శెట్టిని చిత్ర యూనిట్ సంప్రదించింది. కథ విన్న సునీల్ శెట్టి వెంటనే ఓకే చెప్పేశారు. కథ ఆయనకు బాగా నచ్చిందని చిత్ర యూనిట్ వెల్లడించింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. సునీల్ శెట్టి అతి త్వరలో షూటింగ్‌లో పాల్గొననున్నారని చిత్ర యూనిట్ తెలిపింది.

తెలుగు, ఇంగ్లీష్ ద్విభాషా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విష్ణు సరసన కాజల్ అగర్వాల్, రుహానీ సింగ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్‌పై మంచు విష్ణు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

కాగా, గత కొంతకాలంగా మంచు విష్ణు బాగా వెనకబడిపోయారు. గడిచిన ఐదేళ్లుగా విష్ణుకు వరుసగా ప్లాపులే వచ్చాయి. ఈ ఏడాది ‘ఓటర్’ సినిమాతో వచ్చినా వర్కౌట్ కాలేదు. ఇప్పుడు ఏకంగా హాలీవుడ్ సినిమా చేస్తున్నాడు. తానే నిర్మాతగా తెరకెక్కిస్తున్నారు కాబట్టి, కచ్చితంగా ఈ సినిమాలో ఏదో ప్రత్యేకత ఉండే ఉంటుంది. ఇప్పటి వరకు అయితే ఈ సినిమా గురించి పెద్దగా ప్రచారం ఏమీ లేదు. చూద్దాం ఈ సినిమా ఎలా ఉండబోతుందో..!Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here