మందేశారు.. చిందేశారు.. పబ్ నుంచి బయటకొస్తూ..

0
3


మందేశారు.. చిందేశారు.. పబ్ నుంచి బయటకొస్తూ..

బెంగళూరులో విషాదం చోటు చేసుకుంది. వీకెండ్ కావడంతో పబ్‌కు వెళ్లి ఎంజాయ్ చేసిన ఇద్దరు వ్యక్తులు మృత్యువాతపడ్డారు. పబ్ నిర్వాహకుల నిర్లక్ష్యంతో సెకండ్ ఫ్లోర్ నుంచి కిందపడి ప్రాణాలు వదిలారు. బెంగళూరులోని చర్చ్ స్ట్రీట్‌లో ఈ ఘటన జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో ఇద్దరు మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు.

పబ్ దుర్ఘటనలో మరణించిన వారిని వేద, పవన్‌గా గుర్తించారు. వేద బెంగళూరులోని ఓ ఐటీ కంపెనీలో పనిచేస్తుండగా… పవన్ ఓ న్యూస్ పేపర్ కోసం పనిచేస్తున్నాడు. శుక్రవారం రాత్రి పబ్‌కు వెళ్లిన వీరిద్దరూ డ్రింక్స్ తాగుతూ డ్యాన్స్ చేస్తూ ఫ్రెండ్స్‌తో గడిపారు. పబ్ నుంచి బయటకు వచ్చే సమయానికి మద్యం మత్తులో జోగుతున్న వారిద్దరు మెట్లు దిగుతూ తడబడ్డారు. పక్కనే ఉన్న కిటీకీపై పడ్డారు. అయితే ఇద్దరు ఒకేసారి పడటంతో ఆ బరువు మోయలేక కిటికీకి ఉన్న ఫ్రేమ్ ఊగిపోయింది. దీంతో వేద, పవన్‌‍లు ఒక్కసారిగా రెండో అంతస్థు నుంచి పడిపోయారు.

ప్రమాదంలో వేద స్పాట్‌లోనే చనిపోగా.. తీవ్రగాయాలపాలైన పవన్‌ను దగ్గరలోని హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కన్నుమూశాడు. విషయం తెలిసి ఘటనాస్థలికి వచ్చిన కబ్బన్ పార్క్ పోలీసులు పరిసరాలను పరిశీలించారు. కిటికీ ఫ్రేమ్ నాసి రకానికి అయినందున ఇద్దరి బరువు ఆపలేకపోయిందని నిర్థారించారు. సరైన భద్రతా చర్యలు పాటించని పబ్ మేనేజర్, బిల్డింగ్ యజమానిపై ఐపీసీ సెక్షన్ 3.4 ఏ కింద కేసు నమోదుచేశారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here