మద్దతు యోచన మానుకోవాలి

0
3


మద్దతు యోచన మానుకోవాలి

ఆర్మూర్‌, న్యూస్‌టుడే: ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు భాజపా మద్దతిచ్చే యోచనను విరమించుకోవాలని తెలంగాణ మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు సుంకరి మోహన్‌ సూచించారు. ఆర్మూర్‌లో మంగళవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. వర్గీకరణకు మద్దతుగా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. లేదంటే ఈ నెల 10న నిజామాబాద్‌లో పార్టీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని పేర్కొన్నారు. ఎమ్మార్పీఎస్‌ అధ్యక్షుడు మంద కృష్ణమాదిగను ప్రధాని వద్దకు తీసుకెళ్తానని చెప్పాడని, ఇది తగదని తెలిపారు. సంఘం ఆర్మూర్‌ డివిజన్‌ అద్యక్షుడు సంగెం భూమన్న, పట్టణశాఖ అధ్యక్షుడు ధన్‌పాల్‌ తదితరులు పాల్గొన్నారు.



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here