మధ్యాహ్న భోజనం వికటించడంపై విచారణ

0
2


మధ్యాహ్న భోజనం వికటించడంపై విచారణ

పాఠశాలలో వివరాలు తెలుసుకొంటున్న అసిస్టెంట్‌ కలెక్టర్‌, అధికారులు

పిట్లం, న్యూస్‌టుడే: చిన్నకొడప్‌గల్‌ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి 37 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన సంఘటనపై శనివారం జిల్లా అసిస్టెంట్‌ కలెక్టర్‌ తేజస్‌నందులాల్‌ పవార్‌, ఆర్డీవో రాజేశ్వర్‌ విచారణ చేపట్టారు.. పాఠశాలను సందర్శించి ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాస్‌ను సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలను అడిగి తెలుసుకొన్నారు. వంట నిర్వాహకులతో మాట్లాడారు. వంట గదిని, మధ్యాహ్న భోజనం తయారీకి వాడే వంట సామగ్రి, బియ్యం, ఇతర వస్తువులను పరిశీలించారు. ఆర్‌డబ్ల్యూఎస్‌ డిప్యూటీ ఈఈ అరవింద్‌కుమార్‌ పాఠశాలలో నీటి నమూనాలను తీసుకొని పరీక్షలు చేశారు. వైద్యాధికారిని కూడా పలు వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆర్డీవో రాజేశ్వర్‌ మాట్లాడుతూ.. 208 మంది విద్యార్థులు మధ్యాహ్న భోజనం చేశారని అందులో అస్వస్థతకు గురైనవారు 37 మంది కాగా ఎనిమిది మంది విద్యార్థులు తీవ్ర అనారోగ్యానికి గురయ్యారని తెలిపారు. ఈ సంఘటన వంట నిర్వాహకుల నిర్లక్ష్యంతో జరిగినట్లు గ్రామస్థులు చెప్పగా తల్లిదండ్రులతో సమావేశం ఏర్పాటు చేయాలని ఎంఈవో, తహసీల్దార్‌ను ఆదేశించినట్లు పేర్కొన్నారు. వంట చేసే పరిసరాలు పరిశుభ్రంగా లేవన్నారు. శుభ్రతను పాటించాల్సిన బాధ్యత వంట నిర్వహకులదేనని వారిపై చర్యలు తీసుకోవల్సిందిగా తహసీల్దార్‌ను ఆదేశించామన్నారు. వారి వెంట తహసీల్దార్‌ సుధాకర్‌, ఆర్‌ఐ అలీంఖాన్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డీటీ బాలలక్ష్మి, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈ రవళిక, ఎంఈవో దేవిసింగ్‌, వైద్యాధికారి శివకుమార్‌, వీఆర్వో శంకర్‌, పంచాయతీ కార్యదర్శి బల్‌రాం తదితరులు ఉన్నారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here