మధ్య తరగతికి షాకే: ట్యాక్స్ తగ్గినా కంపెనీలు ధరలెందుకు తగ్గించవంటే?

0
1


మధ్య తరగతికి షాకే: ట్యాక్స్ తగ్గినా కంపెనీలు ధరలెందుకు తగ్గించవంటే?

సెప్టెంబర్ 20వ తేదీన కార్పోరేట్ ట్యాక్స్‌ను 30 శాతం నుంచి 22 శాతానికి తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో మార్కెట్లో దాదాపు అన్ని రంగాల షేర్లు జోరందుకున్నాయి. ఈ ప్రకటన చేసిన రోజు సెన్సెక్స్ ఏకంగా 2వేలకు పైగా, నిఫ్టీ 500 వరకు లాభాల్లో తేలియాడింది. ఈ ట్యాక్స్ తప్పింపు వల్ల కేవలం కంపెనీలకే కాదు ఉత్పత్తులు కూడా కస్టమర్లకు తక్కువ ధరకు అందే అవకాశాలు మెండుగా ఉంటాయి. ఈ నేపథ్యంలో కార్పోరేట్ ట్యాక్స్ కట్ కంపెనీలతో పాటు వినియోగదారులకు ఊరటను ఇస్తుందనే అభిప్రాయం ఉంది. అయితే దీనిపై సస్పెన్స్ కొనసాగుతోంది.

తగ్గింపుతో కంపెనీలకు 3 విధాల లాభాలు… రూ.37వేల కోట్ల ఆదా

కార్పోరేట్ ట్యాక్స్ తగ్గింపు వల్ల స్టాక్ మార్కెట్లో నమోదైన టాప్ 1000 కంపెనీల పన్ను ఆదా రూ.37,000 కోట్ల వరకు ఉంటుందని క్రిసిల్ అంచనా. సెప్టెంబర్ 20వ తేదీన మార్కెట్ల జోరు కనిపించింది. ఓ రోజు 5 శాతం లాభం ఎగిసి ఈ దశాబ్దంలో అతిపెద్ద లాభాల్లో ఒకటిగా నిలిచింది. ట్యాక్స్ రేట్ తగ్గింపు వల్ల కంపెనీలకు మూడు రకాలుగా లాభం. ఒకటి… కంపెనీలు అదనపు నగదును తమ వ్యాపారంలో తిరిగి ఇన్వెస్ట్ చేస్తాయి. ఉద్యోగులను చేర్చుకోవడం, కంపెనీని విస్తరించడం, కొత్త సౌకర్యాలు కల్పించడం వంటివి చేయవచ్చు.

ట్యాక్స్ తగ్గించిన ప్రభుత్వం.. ఇక కంపెనీల బాధ్యత

ట్యాక్స్ తగ్గించిన ప్రభుత్వం.. ఇక కంపెనీల బాధ్యత

కార్పోరేట్ ట్యాక్స్ తగ్గింపు నేపథ్యంలో కన్స్యూమర్ గూడ్స్, ఆటోమొబైల్స్, హోమ్స్… ఇలా వివిధ రంగాల ఉత్పత్తులపై ఆయా కంపెనీలు ఆఫర్లు ప్రకటిస్తాయని, ధరలు తగ్గిస్తాయని భావిస్తున్నారు. ఈ ప్రయోజనాలు వినియోగదారులకు అందించవచ్చునని అంటున్నారు. దీంతో వినియోగదారులు తిరిగి షాపింగ్ చేయడం ఎక్కువవుతుందని అంచనా. ఇటీవల నీతి అయోగ్ చైర్మన్ అమితాబ్ కాంత్ మాట్లాడుతూ… ప్రభుత్వం కార్పోరేట్ పన్ను తగ్గించిందని, ఇక ఈ ప్రయోజనాలను వినియోగదారులకు అందించడం కంపెనీల బాధ్యత అన్నారు.

కంపెనీలు ప్రయోజనాలను పార్వార్డ్ చేస్తాయా?

కంపెనీలు ప్రయోజనాలను పార్వార్డ్ చేస్తాయా?

కంపెనీలు ఈ ప్రయోజనాలను కస్టమర్లకు ఫార్వార్డ్ చేస్తుందా లేదా అనేది త్వరలో తేలిపోతుంది. పండుగ సీజన్ కారణంగా ఇప్పటికే వివిధ కంపెనీలు తమ ఉత్పత్తులపై భారీ ఆఫర్లు ప్రకటించాయి. ఇది కూడా డిమాండ్‌ను తగ్గించిన మందగమనంకు ఊరట కలిగించే అంశం. కంపెనీలు మరింత తగ్గింపుకు వెళ్లినా ఆశ్చర్యం లేదు. కానీ ఇది పండుగ సీజన్‌కే పరిమితం అవుతుందా అనేది చూడాలి. కార్పోరేట్ ట్యాక్స్ తగ్గింపు వల్ల కంపెనీలు ఆనందంగా ఉన్నాయి.

డిమాండ్ ఎప్పుడైనా పెరగొచ్చు

డిమాండ్ ఎప్పుడైనా పెరగొచ్చు

కేర్ రేటింగ్స్ ప్రకారం పన్ను రేట్ల తగ్గింపు వ్యాపారం, పెట్టుబడిదారుల మనోభావాలను మరియు విశ్వాసాన్ని పెంపొందిస్తుంది. ఇది కార్పోరేట్ లాభాలను కూడా పెంచుతుంది. ఈక్విటీలలో ఎక్కువ విదేశీ ప్రవాహాలు, రుణవిభాగం నుంచి బయటకు రావడానికి తోడ్పడుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో డిమాండ్ ఎప్పుడైనా గణనీయంగా పెరగవచ్చునని అంటున్నారు.

పన్ను ప్రయోజనాలు అంతగా ఫార్వార్డ్ కాకపోవచ్చు...

పన్ను ప్రయోజనాలు అంతగా ఫార్వార్డ్ కాకపోవచ్చు…

పన్ను ప్రయోజనాలను వినియోగదారులకు అందించవచ్చునని, కానీ భారీగా ఉండకపోవచ్చునని మారుతీ సుజుకీ చైర్మన్ ఆర్సీ భారగ్వ, మహీంద్రా అండ్ మహీంద్రా ఎండీ పవన్ గోయెంకా అన్నారు. తయారీదారులు ఇప్పటికే మంచి డిస్కౌంట్స్ అందిస్తున్నారని, ఈ నేపథ్యంలో తగ్గింపు మరీ ఎక్కువగా ఉండకపోవచ్చునన్నారు. పన్ను తగ్గింపు వల్ల కంపెనీలు ధరలను భారీగా తగ్గించే అవకాశం లేదని గోద్రెజ్ గ్రూప్ చైర్మన్ ఆది గోద్రేజ్ అన్నారు.

కస్టమర్, మధ్య తరగతికి షాకే

కస్టమర్, మధ్య తరగతికి షాకే

మోడీ ప్రభుత్వం కార్పొరేట్ పన్ను తగ్గించినా ఆ ప్రయోజనాలు సామాన్యులకు అందే అవకాశం అంతగా ఉండవని నిపుణులు కూడా చెబుతున్నారు. పరిశ్రమలకు ప్రోత్సాహకాల్లో భాగంగా కార్పొరేట్ ట్యాక్స్‌ను తగ్గించడంతో కన్జ్యూమర్ ప్యాకేజింగ్ గూడ్స్ కంపెనీలు ఆ ప్రయోజనాలను తమ వద్ద ఉంచుకోబోవని, ఆ మేరకు ఉత్పత్తుల ధరలను తగ్గిస్తాయన్న ఊహాగానాలు వినిపించాయి. కానీ అది వాస్తవం కాదని కోటక్ ఇన్‌స్టిట్యూషనల్ ఈక్విటీస్ నివేదిక చెబుతోంది.

పన్ను ప్రయోజనాలు కంపెనీలే అనుభవిస్తాయి..

పన్ను ప్రయోజనాలు కంపెనీలే అనుభవిస్తాయి..

కార్పొరేట్ పన్ను తగ్గింపు ప్రయోజనాలు పూర్తిగా కంపెనీలే అనుభవిస్తాయని పేర్కొంది. ఈ పన్ను తగ్గింపు నేపథ్యంలో ఫుడ్, డ్రింక్స్, దుస్తులు, మేకప్ తదితర ఉత్పత్తులపై ధరలు తగ్గుతాయని, దీంతో సామాన్యులు, మధ్య తరగతి వంటి కస్టమర్లకు కొంత ఊరట లభిస్తుందని భావించారు. అయితే కంపెనీలు సుముఖంగా లేవని కొటక్ నివేదిక తెలిపింది. ప్రభుత్వం నుంచి పన్ను తగ్గింపు రూపంలో అందే ప్రయోజనాలను తమ వ్యాపార అభివృద్ధికి ఇంధనంగా ఉపయోగించుకుంటాయని చెబుతున్నారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here