మరోసారి తగ్గిన బంగారం, వెండి ధరలు

0
2


మరోసారి తగ్గిన బంగారం, వెండి ధరలు

బంగారం ధరలు శుక్రవారం తగ్గాయి. ఎంసీఎక్స్ గోల్డ్ ఫ్యూచర్‌లో 10 గ్రాముల బంగారం ధర 0.27 శాతం తగ్గి రూ.38,475గా ఉంది. అంతకుముందు గురువారం సెషన్‌లో పసిడి ధర 1.31 శాతం లేదా రూ.500 పెరిగింది. శుక్రవారం స్వల్పంగా తగ్గింది. వెండి ధర స్వల్పంగా తగ్గింది. ఎంసీఎక్స్‌లో కిలో వెండి ధర 0.30 శాతం తగ్గి రూ.46,635గా ఉంది. క్రితం సెషన్లో వెండి 1.5 శాతం పెరిగింది.

అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ఫ్లాట్‌గా ఉంది. ఔన్స్ బంగారం 1,512.54 డాలర్లుగా ఉంది. గ్లోబల్ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ధరలు ఈ వారం 0.5 శాతం మేర పెరిగాయి. అంతకుముందు వారం 1 శాతం మేర పెరిగాయి.

కాగా, ధన్‌తెరాస్, దీపావళి అంటే బంగారం అమ్మకాలు భారీగా ఉంటాయి. కానీ ఈసారి గతంలో కంటే తగ్గిపోయిన విషయం తెలిసిందే. అదే సమయంలో ట్రేడర్లు ఊహించిన దాని కంటే ఎక్కువ కొనుగోళ్లు జరిగాయి. బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతుండటంతో కొనుగోలుకు కస్టమర్లు పెద్దగా ముందుకు రాని పరిస్థితి. దీంతో ట్రేడర్లు కూడా సేల్స్ భారీగా తగ్గిపోతాయని భావించారు.

కానీ ధన్ తెరాస్, దీపావళి పండుగ సమయంలో గత ఏడాది కంటే సేల్స్ తగ్గినప్పటికీ ట్రేడర్లు ఊహించిన దాని కంటే ఎక్కువ సేల్స్ జరిగాయి. ధన్‌తెరాస్ రోజు 30 టన్నుల బంగారం కొనుగోళ్లు జరిగాయి. గత కొన్నేళ్లుగా దీపావళి సీజన్లో అమ్మకాలు 40 టన్నులకు చేరుకున్నాయి.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here